Categories: HealthNews

Health Tips: వేసవికాలంలో కలరా, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఈ పండు తినాల్సిందే!

Health Tips: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందువల్ల వేసవికాలంలో కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఒక పండు తీసుకోవడం వల్ల కలరా, హిట్ స్ట్రోక్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఇలా మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఆ పండు మారేడు పండు. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు, వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఫైబర్, ఐరన్, ప్రోటీన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటమే కాకుండా కాల్షియం, విటమిన్ ఏ, సి , డి వంటివి కూడా అధికంగా ఉన్నాయి.

ఈ పండు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే వేసవికాలంలో ఈ పండు తినటం వల్ల శరీరానికి చలువ లభిస్తుంది. అలాగే ఇది గుండె , మెదడుకు టానిక్‌గా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం విరోచనాలు వంటి సమస్యల పరిష్కారానికి కూడా ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే పొట్టలో అల్సర్‌తో బాధపడుతున్నప్పుడు బిల్వపండు తినడం మేలు చేస్తుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల పొట్టలోని లైనింగ్‌పై పొర ఏర్పడుతుందని, ఇది అల్సర్‌లు వేగంగా నయం అవుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

Health Tips:

అలాగే ఈ పండులో ఉండే బిల్వలో టానిన్ కలరా వ్యాధి నిర్మూలనకు ఉపయోగపడుతుంది. కలరా సమస్యతో బాధపడేవారు ఈ పండుని తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ పండుని నేరుగా తినలేని వారు జ్యూస్ చేసుకుని కూడా తాగవచ్చు. అలాగే ఈ పండుతో తయారుచేసిన జ్యూస్ తాగటం వల్ల లిపిడ్ ప్రొఫైల్ , ట్రైగ్లిజరైడ్‌లను నియంత్రనకు సహాయపడుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో అధిక బరువు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్లు కూడా ఈ పండు తినటం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది .

Sravani

Recent Posts

Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే ..?

Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…

2 weeks ago

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 month ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 month ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 month ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 month ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 month ago

This website uses cookies.