Health Tips: సాధారణంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వడదెబ్బ, డీ హైడ్రేషన్ వంటి సీజనల్ సమస్యల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ క్రమంలో వేసవిలో లభించే సీజనల్ ఫ్రూట్స్ ఎంతో ఉపయోగపడతాయి. అలా వేసవిలో లభించే పండ్లలో కోకుమ్ కూడా ఒకటి. ఈ పండులో ఉండే పోషకాలు వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలిగించటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మన శరీర వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఈ కోకమ్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి3, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కోకుమ్ పండ్లతో చేసే షర్బత్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపకరిస్తుంది. అంతే కాకుండా ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల అసిడిటీ, అజీర్ణంతో బాధపడుతున్న రోగులు ఈ డ్రింక్‌ని తాగడం వల్ల ఉపశమనం పొందుతారు. అలాగే ఈ పండ్లు గుండె కి ఎంతో మేలు చేస్తాయి.
కోకమ్‌లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. . దీనిలోని మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి మినరల్స్ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి గుండె సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. శరీర ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా చర్మ రక్షణలోను ఈ పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. కోకుమ్ పండులో ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్ ఉండటంతో వృద్ధాప్య లక్షణాలను తగ్గించగల శక్తి వీటికి ఉంటుంది. డెడ్ స్కిన్స్, మొటిమలను తొలగించడంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.