Health Tips: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తరచూ దాహం వేస్తుంది. వేసవికాలంలో శరీరానికి సరిపడా నీరు తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ బారిన పడి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో వీలైనంత ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది. అయితే వేసవి కాలంలో కొన్ని సందర్భాలలో ఎంత నీరు తాగినా కూడా దాహం తీరదు. అటువంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. వేసవికాలంలో శరీరం డిహైడ్రేషన్ బారీన పడకుండా ఉండటానికి నీరు త్రాగటంతో పాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు మూడు నుండి నాలుగు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నీరు తాగినా కూడా తరచూ దాహం వేస్తుంటే నీటితో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉండటం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో పుచ్చకాయ, కీరదోస, దోస వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి.
అలాగే శరీరంలో సోడియం, పొటాషియం తగ్గిపోవడం వలన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గా ఉండవు అలాంటి సమయంలో నీళ్ళు తాగినా కూడా ఇంకా దాహం అనిపిస్తుంది. అలాంటి సమయంలో రెండు మూడు పండ్లకు కొద్దిగా పింక్ సాల్ట్ అంటించి తీసుకుంటే మంచిది. ఇలా పండ్లతో పాటు పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్ జత చేసి తీసుకుంటే దాహం తీరుతుంది. అలాగే వేసవికాలంలో శరీరానికి చల్లదనం అందించే మజ్జిగ, నిమ్మరసం, సబ్జా గింజల నీరు, ఇతర పండ్ల జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.