Health Tips: సాధారణంగా ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది. ఇలా ఉదయం లేవగానే కాఫీ టీ తాగకపోతే కొంతమందికి ఆ రోజు మొదలవదు. ఇలా ఎంతోమంది కాఫీ టీ లకు బాగా అలవాటు పడి ఉదయం లేవగానే వాటిని తాగకపోతే రోజు మొత్తం చిరాకుగా ఉంటారు. అయితే ఇలా ఉదయం లేవగానే పరగడుపున కాఫీ, టీ వంటివి తాగటం చాలా పొరపాటని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాఫీ, టీ తాగాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని చెబుతున్నారు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
ఉదయాన్నే టీ తాగడం వల్ల పండ్లలో ఉండే ఎనామిల్ దెబ్బ తింటుందని చెబుతున్నారు. పరగడుపున టీ తాగడం మంచిది కాదు. ఖాళీ కడుపుతో టీ తాగితే అనారోగ్యమే. ఖాళీ కడుపుతో టీ తాగితే పేగులలో పొర ఏర్పడుతుంది. అంతకుముందు గోరువెచ్చని నీళ్లు తాగాలి. టీ పరగడుపున తాగితే నష్టాలే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా పరగడుపున టీ తాగడం మంచిది కాదు.
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు మొదలవుతాయి. ప్రతీ రోజు ఇలా కాళీ కడుపుతో టీ కాఫీలు తాగడం వల్ల పొట్టలో ఆమ్లం పెరిగి ఆరోగ్యం చెడిపోతుంది. అంతేకాకుండా ఇలా చేయటం వల్ల దంతాల బయటి పొర క్షీణించి దంతక్షయం ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఖాళీ కడుపుతో టీ తాగితే శరీరం డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇలా ఉదయం లేవగానే టీ కాఫీలు తాగటం వల్ల కళ్ళు తిరగటం గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తలెత్తుతాయి.
అందువల్ల ఉదయం లేచిన వెంటనే ఒకేసారి కాఫీ టీ తాగకుండా ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. కాఫీ టీ తాగటానికి 10 ,15 నిమిషాల ముందు ఇలా గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల గ్యాస్టిక్, ఎసిడిటీ వంటి సమస్యల దరి చేయడమే కాకుండా కాఫీ,టీ లు తాగటం వల్ల కూడా ఎటువంటి సమస్య తలెత్తదు. అలాగే కాఫీ టీ తాగేటప్పుడు దానితోపాటు ఏదైనా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. గ్యాస్, మలబద్ధకం కడుపునొప్పి వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఉదయం గోరువెచ్చని నీరు తాగిన తర్వాత కాఫీ టీలు తాగటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.