Diabetes : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ షుగర్ వ్యాధి ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆహార పదార్థాల విషయంలో ఎంత జాగ్రత్తలు పాటించినప్పటికీ షుగర్ డౌన్ అవడం లేదంటే షుగర్ ఎక్కువ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే చాలామంది షుగర్ పేషెంట్లు బెండకాయ తినవచ్చా లేదా అని సందేహపడుతూ ఉంటారు. ఏం బెండకాయను తినవచ్చో,తినకూడదో తింటే ఏం జరుగుతుందో అని సందేహపడుతూ ఉంటారు. మరి ఏం డయాబెటిస్ పేషెంట్లు బెండకాయలు తినవచ్చా,లేదా ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
షుగర్ లెవల్స్ వల్స్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని దేశాల్లో బెండకాయను తింటారు. రక్తంలో ఉండే చక్కెర శాతాన్ని బెండకాయ తగ్గిస్తుంది. దీంట్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. జీవక్రియను కూడా ఇది మెరుగు పరుస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు బెండకాయలను ఎక్కువగా తీసుకోవాలి. షుగర్ ను కంట్రోల్ లో ఉంచడంతో పాటు శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతినకుండా బెండకాయ చక్కగా పనిచేస్తుంది. బెండకాయ గింజలు, తొక్కలో షుగర్ ను కంట్రోల్ చేసే కారకాలు పుష్కలంగా ఉంటాయి.
బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. ఊబకాయం సమస్యను దూరం చేస్తాయి. అయితే బెండకాయను చాలామంది వేపుడుగా చేసుకొని తింటుంటారు. అలా తినకూడదు. బెండకాయను ఉడకబెట్టి తినాలి. నూనెలో వేయించి తింటే అందులో ఉండే పోషకాలు శరీరానికి అందవు. బెండకాయను తక్కువ నూనె వేసి కూరలాగా వండుకొని తినండి. లేదంటే బెండకాయను పైన భాగం, కింద భాగం కట్ చేసి వాటిని ఓ గిన్నెలో నానబెట్టండి. ఉదయం బెండకాయలను నానబెట్టిన నీటిని తాగేస్తే మంచి లాభాలు ఉంటాయి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.