Summer: వేసవి వచ్చింది అంటే గ్రామీణ ప్రాంతాలలో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే వాటిలో మామిడి పండ్లు తర్వాత తాటి ముంజలు ఎక్కువగా కనిపిస్తాయి. తాటి కాయలు, తాటి ముంజల గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికీ చిన్ననాటి జ్ఞాపకాలు వెంటనే గుర్తుకొస్తాయి. స్కూల్ కి వేసవి సెలవులు రాగానే పల్లెటూరిలో పిల్లబ్యాచ్ అంతా సమీపంలో ఉన్న తాటి చెట్ల వద్దకి కత్తి పట్టుకుని వెళ్లి చెట్టుపైకి ఎక్కి తాటి కాయలు కొట్టుకొని అందులో ఉన్న తాటి ముంజలని ఇష్టంగా తినేవారు.
గ్రామీణ ప్రాంతంలో పెరిగే ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ జ్ఞాపకాలు ఉంటాయి. అయితే మారుతున్న కాలంతో పాటు చాలా మంది ఉద్యోగ వేటలో సిటీలకి వచ్చి సెటిల్ అయిపోయారు. దీంతో తాటి ముంజల ప్రాముఖ్యతని చాలా మంది మరిచిపోయారు. అయితే సిటీలో కూడా వేసవి వచ్చింది అంటే అక్కడక్కడ ఎవరో ఒకరు తాటి ముంజలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అయితే వాటిని చూడగానే చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు తప్ప ఎవరూ పెద్దగా కొని తినడానికి ఇష్టపడరు.
అయితే తాటి ముంజల వలన ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలిస్తే కచ్చితంగా మళ్లీ మీరు వాటిని కొని వెంటనే తింటారు. తాటి ముంజలలో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. ప్రకృతిలో సహజంగా లభిస్తూ ఎలాంటి కల్తీ లేకుండా ఉన్న పోషక పదార్థాలలో కొబ్బరి బొండాం నీళ్ళు తర్వాత తాటి ముంజలే అని చెప్పాలి. వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ బి, సి, జింక్, ఐరన్, పాస్పరస్, పొటాషియం వంటి పోషక విలువలు ఉంటాయి.
తాటి ముంజలు కారణంగా డిహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. తాటి ముంజలలో అధిక క్యాలరీలు పోషకాలు ఉండటం, అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్నిస్తుంది. అలాగే తాటి ముంజలు క్యాన్సర్ కణాలు అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంతోసైనిన్ వంటి వాటిని నిర్మూలించడంలో సహాయ పడతాయి. అలాగే బిపీ కంట్రోల్ చేయడంలో గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో తాటి ముంజలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్న తాటి ముంజలని ఇకపైన కాస్త టెస్ట్ చేసే ప్రయత్నం చేయండి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.