Tollywood: కొద్ది రోజుల క్రితం యువ దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ చాప్టర్ 2 మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని ప్రేక్షకులు ఎందుకు హిట్ చేసారో అర్ధం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు. అలాగే అందులో రాఖీ భాయ్ పాత్ర మలచిన విధానంపైన కూడా ఘాటుగా బూతులతో విమర్శలు చేశారు. దీంతో అవి వైరల్ గా మారాయి. ఇక తన మాట్లాపై వెంకటేష్ మహా వివరణ ఇచ్చుకున్నారు. అయితే అదే ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాలు అంటూ అసలు తల తోక లేకుండా, సీన్ కి సీన్ కి సంబంధం లేకుండా కథలు తెరకెక్కిస్తున్నారని, బేసిక్ ఎథిక్స్ లేకుండా మోరల్స్ లేకుండా సినిమాలు చేస్తున్నారు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. మేము కత్తి పట్టడం మొదలు పెడితే వారికంటే బాబు లాంటి సినిమాలు చేయగలం అంటూ కామెంట్స్ చేశారు.
ఈ కామెంట్స్ అయితే వీటిపై అతను ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో కమర్షియల్ జోనర్ లో హీరోయిక్ కథలతో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్న స్టార్ దర్శకులలో హరీష్ శంకర్ కి వెంకటేష్ మహా వ్యాఖ్యల మీద కోపం వచ్చినట్లు ఉంది. ఈ నేపధ్యంలో బలగం సక్సెస్ ఈవెంట్ లో హరీష్ శంకర్ కాస్తా సీరియస్ గా మాట్లాడారు. అసలు సినిమాలలో కమర్షియల్, క్లాసిక్ అనే విభజన ఉండదని, మనకి అర్ధం కావడం కోసం అలాంటి డిఫరెన్స్ పెట్టుకున్నాం అని అన్నాడు. అదే సమయంలో సినిమా ఎలా తీసాం అని అని కాదు ప్రేక్షకుకిడికి అది నచ్చిందా లేదా అనేదే కొలమానం అన్నారు.
ప్రేక్షకులకి నచ్చితే ఫార్మాట్ తో సంబంధం లేకుండా సినిమాలు చూసి సక్సెస్ చేస్తారని అన్నారు. సాగర సంగమం సినిమాలో ఏం కమర్షియల్ అంశాలు ఉన్నాయని ప్రేక్షకులు అంతగా ఆదరించారు. అలాగే తాజాగా వచ్చిన బలగం సినిమా చూసిన తర్వాత కమర్షియల్ చిత్రాలు చేసిన దర్శకులు అందరూ కూడా బాగుందని మెచ్చుకున్నారు. ప్రియదర్శి మల్లేశం సినిమా తనకి భాగా నచ్చింది. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం లాంటిది .
ఒక్కొక్కరు ఒక్కోరకమైన సినిమా చేయొచ్చు అయితే అవి ప్రేక్షకులకి నచ్చాలని కోరుకోవాలి. ఒక సినిమా పోవాలి, మా సినిమా మాత్రమే ఆడాలి అనే ఆలోచన ఉండకూడదు. అన్ని కమర్షియల్ 300 కోట్లతో తీసిన 3 కోట్లతో తీసిన ప్రజలకి నచ్చేది కమర్షియల్ సినిమా అవుతుంది. దానికి ప్రత్యేకంగా ఎలాంటి హంగులు అవసరం లేదు. అనవసరమైన ఆరోపణలు చేసుకోకుండా ఉండటం సరైన పద్ధతి అంటూ హరీష్ శంకర్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.