Hanuman-Teja Sajja : అప్పట్లో సూపర్ హిట్ అయిన చిరంజీవి సినిమా ‘చూడాలని వుంది’ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యాడు తేజ సజ్జా. మొదటి సినిమాలోనే ఎంతో బాగా నటించి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ బుల్లోడికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అప్పట్లోనే చాలా మంది అంచనా వేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ లు నటించిన సినిమాల్లో బాలనటుడిగా తేజ నటించి చాలా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే యువ నటుడిగా మంచి కథలతో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు తేజ్. సమంత నటించిన ఓ బేబీ సినిమాతో తేజ్ నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినమా హిట్ కావడంతో జాంబీరెడ్డి తో హీరోగా మారి మొదటి మూవీతోనే మ్యాజిక్ చేసి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఇష్క్, అద్భుతం సినిమాల్లోనూ నటించి మంచి పెర్ఫార్మర్ గా పేరు సంపాదించుకున్నాడు.
తనను హీరోగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూజ్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే ఇఫ్పుడు తేజ్ హనుమాన్ సినిమా చేశాడు. ఈ సినిమా గత రెండేళ్లుగా సెట్స్ లోనే ఉంది. సినీ అభిమానులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతోనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి మెరుగులు దిద్దుతూ వచ్చారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు. పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ ఉండబోతోందని తెలుస్తోంది. హనుమాన్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి దేశీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది. ఇది మొట్టమొదటి ఇండియన్ సూపర్ హీరో సినిమా అంటూ తాజాగా మూవీ టీమ్ హనుమాన్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. విజువల్స్ మాత్రం పిచ్చెక్కిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ మీడియాతో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో ఒక సీనియర్ పాత్రికేయుడు హీరో తేజాను ఓ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న తేజను బాగా బాధించింది. అయినా ఆ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా చాలా స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇచ్చాడు. అసలు ప్రశ్న ఏమిటంటే ” మిమ్మల్ని ప్రజలు ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ గానే చూస్తున్నారా? మీరు పూర్తిస్థాయిలో హీరో అయ్యారనని భావిస్తున్నారా ? అని జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో తేజ ఫేస్ ఒక్కసారిగా మారిపోయింది. దీనికి సమాధానంగా ” నా వయసు ఎంతనుకుంటున్నారు ?చైల్డ్ ఆర్టిస్ట్ గా చూస్తూ మంచిదే కదా సార్. వాళ్లకు నా మీద లవ్ ఎప్పటికీ ఉంటుంది. వారింట్లోని పిల్లాడిలా చూస్తారు. చూస్తే మంచిదే కదా” అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ జర్నలిస్టే మరో ప్రశ్నఅడిగాడు. “ఈ సినిమాలో కొంచెం మీ లెవెల్‌కు దాటిన కాన్వాస్‌లా ఉందంటారా” అని అడిగారు. దీంతో తేజాకు బాగా కాలినట్లుంది. “నేను చెప్తాను మరి మీరు ఏమీ అనుకోకూడదు. అంటూ మొదలుపెట్టాడు “ఎవరైనా రెండోతరం నటులు ఇండస్ట్రీకి వచ్చి వారు తమ మొదటి సినిమానే ఇంత కన్నా పెద్ద మూవీ చేశారనుకోండి మీరెవరూ ఈ క్వశ్చన్ అడగడం లేదు ఎందుకు. నాలాంటి వాడిని.. చిన్నప్పటి నుంచీ ఇక్కడ ఉన్న వాడిని, కష్టపడి పైకి వచ్చే వాడిని , మీరు ఈ సినిమాకు సరిపోతారా అంటే నన్ను చిన్నచూపు చూసినట్టు అనిపిస్తోంది.సినిమాకి నేను ఏమిచ్చానె డైరెక్టర్ కి తెలుసు. నేను నా సినిమాల్లో వంద శాతం కష్టపడ్డాను. అందువల్లే నాకు ఈ ఛాన్స్ వచ్చిందేమో. నేను ఉండడం వల్లే మీరు ఆర్చర్య పోయారేమో. ఇది దేవుడు ఇచ్చిన అవకాశం” అని తేజ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.