Guppedantha Manasu: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లోప్రసారమవుతున్నటువంటి ఈ సీరియల్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే…
వసుధార రిషి ఇద్దరు కూడా జయచంద్ర చెప్పిన మాటలను ఆలోచిస్తూ ఉంటారు. రిషి విషయం గురించి ఆలోచిస్తూ నేను ఇంకా ఈ విషయం గురించి ఆలస్యం చేయడం మంచిది కాదు వసుధారని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనుకుంటూ వసుధారను నా భార్యగా అంగీకరించాలి అనుకుంటాడు. మరోవైపు వసుధార జయ చంద్ర మాటలను గుర్తు చేసుకొని నేను తొందరపడి ఆ తాలిని నా మెడలో వేసుకున్నానా..ఈ తాళి వల్ల రిషి సార్ బాధపడుతున్నారా ఎలాగైనా ఈ తాళిని తీసేసి తిరిగి రిషి సార్ ని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
మరోవైపు దేవయాని ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని చెప్పినా వసుధార రిషిలది పెళ్లి కానే కాదు అని చెప్పగా జగతి అదేంటక్కయ్య రిషి తన భర్త అని ఊహించుకొని వసుధార మెడలో తాళి వేసుకుంది కదా అని చెప్పడంతో ఎవరిని పడితే వారిని ఊహించుకొని మెడలో తాళి వేసుకుంటే అది పెళ్లి అయిపోతుందా అని దేవయాని మాట్లాడినట్లు వసుధార కలగంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం దేవయాని అసలు ఈ జయచంద్ర ఎందుకు వచ్చారు ఏం జరుగుతుంది.. రిషి వసుల పెళ్లి గురించి ఈయన ఏం మాట్లాడారు అని ఆలోచిస్తూ ఉంటుంది.ఆ వసుధార ఇప్పటికే నాపై పెత్తనం చేస్తుంది. ఇక రిషి తనని భార్యగా అంగీకరిస్తే అసలు ఊరుకోదు ఎలాగైనా వీరిని విడదీయాలన్న ఉద్దేశంతో వసుధార గదికి వెళ్తుంది.
మరోవైపు రిషి వసుధారగురించి ఆలోచిస్తూ ఉండగా దేవయాని వసుధార గదికి వెళుతుంది అక్కడ వసుధార లేకపోవడంతో ఒకవేళ బాత్రూంలో ఉందేమోనని అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది అయితే తనకు అక్కడ తాళి కనిపించడంతో దీనిని ఎలాగైనా తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన దేవయాని ఆ తాలిని తీసుకెళ్లి రిషి గదిలో పడేస్తుంది. మరోవైపు వసుధార గురించి రిషి ఆలోచిస్తూ నీతో చాలా మాట్లాడాలి, నీతో చాలా చెప్పాలి, నీకు సారీ చెప్పబోతున్నాను, ఈరోజు మన మధ్య ఉన్న దూరానికి ముగింపు పలకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.అయితే అంతలోపు దేవయాని అక్కడికి రావడంతో వసుధార వచ్చింది అనుకొని రా వసుధార నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు..
ఇక దేవయాని తాళి అక్కడ పడేసి వెళ్లిపోవడంతో రిషి తిరిగి చూసేసరికి అక్కడ వసుధార ఉండదు. తాళి ఒక్కటే ఉండడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఆ తాళి తీసుకుని హాల్లోకి వచ్చి గట్టిగా వసుధార అని అరుస్తాడు. అక్కడికి రాగానే మన మధ్య ఉన్న బంధానికి ఇదేనా నువ్వు ఇచ్చే గౌరవం,నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అని నేను అనుకున్నాను కానీ అంతలోపే నువ్వు దానిని తుడిచి వేశావు. నా పంతం పక్కనపెట్టి నీ ప్రేమకు విలువ ఇవ్వాలనుకున్నాను కానీ నువ్వు నీ పొగురు చూపించావు అని అంటాడు. వసుధారకు మాట్లాడకుండా రిషి తనని తిట్టడంతో అసలు ఏం జరిగిందో చెప్పండి సార్ అని అనగా చేతిలో తాళిని చూపిస్తాడు. ఒక అమ్మాయి మెడలో తాళి తీసింది అంటే దానికర్థం ఏంటి నువ్వు నా ప్రేమను రిజెక్ట్ చేసినట్లే కదా అంటూ మాట్లాడుతారు. నేను మీ గదికి రాలేదు సార్ అని వసుధార చెప్పిన హరీష్ వినడు.
ఇక పనింద్ర దేవయాని నువ్వు రిషి గదికి వెళ్లడం నేను చూశాను ఎందుకు వెళ్లావు అంటూ గట్టిగా నిలదీయడంతో నేనే ఆ తాళిని రిషి గదిలో వేశాను అని దేవయాని ఒప్పుకోవడంతో అందరూ షాక్ అవుతారు. ఎందుకు అలా చేశావని నిలదీయగా నేను వసుధార గదికి వెళ్ళగా తాళి అక్కడ ఉంది దానిని తీసుకెళ్లి రిషి గదిలో పెట్టాను రిషి చేతుల మీదుగా వేస్తే నాకు మనస్పూర్తిగా ఉంటుందని అలా చేశాను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.వెంటనే వసుధార ఈ చిన్న విషయానికి ఇంత అపార్థం చేసుకున్నారు సర్ అనడంతో వసుధార చేతులు పట్టుకొని నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని నాకు భయం వసుధారా అనగా నేను మీకు దూరమైనప్పుడు ఈ వసుధర ఆఖరి శ్వాస కూడా అదే అవుతుంది సార్ అంటూ వసుధార మరోసారి తన ప్రేమను వ్యక్త పరుస్తుంది.ఇకపై మీరు ఒకరినొకరు విభేదించుకోవడం మానేసి మీ జీవితం ఏంటో మీరే నిర్ణయించుకోండి అంటూ జగతి అక్కడి నుంచి వెళ్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.