Categories: EntertainmentLatest

Guppedantha manasu serial: ‘నా విషయంలో జోక్యం చేసుకోవద్దు పెద్దమ్మా..’ అంటూ దేవయానికి షాకిచ్చిన రిషి!

Guppedantha manasu serial: దేవయాని బయటికెళ్లిందంటే ఎవరికో మూడినట్టే అంటాడు మహింద్ర. అపుడే రిషి కారు వస్తుంది. తనతోపాటు దేవయాని కూడా రావడం చూసి షాకవుతారు జగతి, దంపతులు. పెద్దమ్మా.. మా విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. ఇంకోసారి వసుధార ఇంటికెళ్లొద్దని చెప్తాడు రిషి. ఆ తర్వాత జగతి, మహింద్రలు కూడా ఎందుకు అక్కడికి వెళ్లారని అడుగుతారు. దేవయాని కోపంతో మండిపోతుంది.

సీన్ కట్ చేస్తే.. వసుధార పాటలు వింటూ వంట చేస్తుంది. అపుడే రిషి వసు ఇంటికి వస్తాడు. కిచెన్‌లో నుంచి చక్రపాణిని పిలిచి టీపౌ క్లీన్ చేయమని చెప్తుంది వసు. నాన్నా ఒకసారి ఇటు రండి అంటే రిషి వెళ్లి వెనక నిల్చుంటాడు. అలా ఇద్దరి మధ్య కాసేపు రొమాంటిక్ సీన్ నడుస్తుంది. ఆ తర్వాత వసు ఇదంతా నా భ్రమనా అనుకుంటుంది. అపుడే బయట చక్రపాణి రిషితో మాట్లాడడం విని వసు పరుగున వెళ్తుంది. గుడ్ మార్నింగ్ చెప్పినా రిషి రిప్లై ఇవ్వడు. సార్ మీరు కిచెన్‌లోకి వచ్చారా? అని అడగ్గా… అక్కడ నాకేం పని అని కాస్త కోపంగానే అంటాడు రిషి.

Guppedantha manasu serial: rishi forbids devayani

Guppedantha manasu serial: ప్రాజెక్ట్‌కు సంబంధించిన పెన్ డ్రైవ్ ఇది అంటూ టేబుల్ మీద పెడతాడు. ఇంకెన్ని రోజులు నామీద కోపం సర్ అంటుంది వసు. నువ్ చేసింది చిన్న తప్పా? నీ మెడలో తాళి తీసేయగలవా? అంటాడు రిషి. అంతలోనే చక్రపాణి కాఫీ తీసుకొని వస్తాడు. రిషి సార్ ఉప్మా తింటుంది అంటుంది వసు. నాకు ఏదీ వద్దంటూ వెళ్లిపోతాడు రిషి.

ఆ తర్వాత జగతి, మహింద్రలు బయట కొబ్బరి నీళ్లు తాగుతూ రిషి వసుల పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. మధ్యలో జగతి మహింద్రకు చేతులెత్తి దండం పెట్టి రిషి పెళ్లి విషయంలో జోక్యం చేసుకోకండని వేడుకుంటుంది. అలా ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు.

సీన్ కట్ చేస్తే.. వసు క్లాస్‌లో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్తుంది. రిషి పక్కనే ఉండి వసు మాటల్ని వింటాడు. వసు చూడకముందు రిషి వచ్చి క్లాసులో కూర్చుని వసు పాఠాల్ని వింటాడు. వసు మంచి టీచర్ అంటూ పొగడుకుంటాడు రిషి మనసులో. రిషిని చూసి క్లాసులో ఉన్నాడని.. ఇదంతా నా భ్రమని అనుకుంటుంది వసు. క్లాస్ అయిపోయాక స్టూడెంట్స్ అందరూ వెళ్లిపోతారు. రిషి మాత్రం అక్కడే కూర్చుంటాడు. వసు వెళ్లి ఎప్పుడొచ్చారు సార్ అని అడుగుతుంది. నా ఉంగరం నాకివ్వమని అడుగుతాడు రిషి. కుదరదని చెప్తుంది వసు. వీఆర్ అంటే రెండు ఆత్మలు. మనం కూడా ఇలాగే కలిసి పోవాలి అని హితబోద చేస్తుంది వసు. బంధం అంటే బాధపెట్టడమా? అంటూ నిలదీస్తాడు రిషి. అంతలోనే రిషికి ఫోన్ వస్తుంది. వస్తున్న డాడ్ అంటూ వెళ్లిపోతాడు రిషి.

రిషి వెళ్లిపోయాక వసు ఒంటరిగా బాధపడుతుంది. నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు సార్ అంటూ మదనపడుతుంది. ఏం చేయగలను సర్ ఒక ఒంటరి ఆడపిల్లను. అక్షరాలే కాదు సర్ మనం కూడా ఎప్పటికి ఒకటిగానే ఉండాలని రిషిని ఉద్దేశించి మనసులో బాధపడుతుంది వసు.

Savitha S

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

5 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.