Categories: EntertainmentLatest

Guppedantha manasu serial: ‘వసుకు నా పరిస్థితి రాకూడదు’ అంటూ కొడుకును వేడుకున్న జగతి.. రిషి ఏం చేస్తాడో మరి?

Guppedantha manasu serial: నీ అనుమతి లేకుండానే నీ పేరు చెప్పాను. వసు ఆవేదనతో తనకు తోచిన పని చేసిందని రిషికి నచ్చచెప్తుంది జగతి. కానీ రిషి మాత్రం వసు చేసింది తనకు నచ్చలేదని చెప్తాడు. తను చేసింది తప్పయినపుడు నేను చేసింది కూడా తప్పే కద రిషి అంటుంది జగతి. నేనేం చేసిన మీ బంధాన్ని కాపాడడానికే రిషి అంటుంది. మేడం మీరు చేసింది పొరపాటని నేను అనలేదు కదా. లేకపోతే అందరిముందు అదే నిజమని నేను ఒప్పుకునేదాన్ని కాదు కదా అంటాడు రిషి. కానీ గతంలో చేసినవి మాత్రం కరెక్ట్ అని అనుకోవట్లేదు మేడం అంటాడు రిషి. రోజులు మారితే గాయం మానుతుందని అంటారు కానీ మనసుకు తాకిన గాయం మానదు మేడం అంటాడు. వసుని ఎప్పటికి క్షమించలేవా అని ప్రశ్నిస్తుంది జగతి. దానికి నా దగ్గర ఇపుడు సమాధానం లేదు మేడం అంటాడు. వసుకు నా పరిస్థితి రాకూడదు రిషి అని వేడుకుంటుంది జగతి.

సీన్ కట్ చేస్తే.. వసు తండ్రికి సపరియలు చేస్తుంటుంది. ఆ తర్వాత రిషికి మేసేజ్ చేయాలనుకుంటుంది. కానీ డిస్ట్రబ్ చేయడమెందుకుని ఆగిపోతుంది. డోర్ పెట్టలేదని చూసి పెడుతుండగా అపుడే రిషి వస్తాడు. బాగా తలనొప్పి వస్తుంది నీ చేతి కాఫీ తాగుదామని వచ్చా అంటాడు. వసు వెళ్లి కాఫీ పెట్టి తీసుకొస్తుంది. కాఫీ తాగుతుండగా వసు మాట్లాడుతుంది. సర్ నాకు పొగరు, ఇగో మీ ముందు ఉండవు సర్. మీ ముందు వసుధార నిలువెళ్లి కరిగిపోతుంది అని చెప్పుకుంటుంది. అపుడున్న తన పరిస్థితిని అర్థం చేసుకోమని వేడుకుంటుంది. రిషి మనసులో ఆ ఒక్క పని చేయకుండా ఉంటే బాగుండు వసుధార అనుకుంటాడు. కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పి రిషి వెళ్తుండగా వసుధార అడ్డుకుంటుంది. నాతో ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నారున సర్ అని అడగ్గా.. జగతి మాటల్ని గుర్తుచేసుకుని వసుని హగ్ చేసుకుంటాడు రిషి. ఇదే మన బంధం.. ఇదే మన దూరం అని చెప్పి వెళ్లిపోతాడు.

Guppedantha manasu serial: jagati is anxious

Guppedantha manasu serial: ఆ తర్వాత సీన్‌లో రిషి కాలేజికి వస్తుండగా కొందరు స్టూడెంట్స్ దారికి అడ్డంగా నిల్చుంటారు. అపుడే వేరొక కారులో జగతి, మహింద్రలు కూడా వస్తారు. రిషి దిగి ఏంటని అడగ్గా.. హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ సర్ అంటారు. అక్కడ జగతి, మహింద్రలు ఈ ఫ్లకార్డ్స్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటని అనుకుంటారు. అక్కడ స్టూడెంట్స్ మేడం రాలేదా సర్ అని అడుగుతారు. రిషి మాత్రం ఏం చెప్పకుండా వెళ్లిపోతాడు. మహింద్ర వాళ్లకు థ్యాంక్స్ చెప్పి పంపించేస్తాడు.

సీన్ కట్ చేస్తే.. వసు రిషితో పంచుకున్న గుర్తుల్ని తలుచుకుంటూ బాధపడుతుంది. పక్కన ఫోన్ మోగుతున్న పట్టించుకోవడంతో చక్రపాణి వచ్చి ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతాడు. వసు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మినిస్టర్ గారి పీఏ మిమ్మల్ని మినిస్టర్ రమ్మన్నారని చెప్తాడు. రిషి సర్ ని కనుక్కొని చెప్తానంటుంది వసు. రిషికి విషయం ఎలా చెప్పాలో అర్థం కాదు వసుకు.

ఆ తర్వాత రిషి వసు ఇంకా కాలేజికి రాలేదేంటని ఆలోచిస్తాడు. అపుడే వసు కూడా మెసేజ్ పెట్టాలని అనుకుంటుంది. అలా ఇద్దరూ వేర్వేరుగా దాని గురించే ఆలోచిస్తారు. వసు మెసేజ్ పెట్టి కావాలనే డిలిట్ చేస్తుంది. రిషి మెసేజ్ చూడకముందే డిలీజ్ చేయడంతో ఏంటి ఈ పొగరు అసలు ఏమనుకుంటుంది అనుకుంటాడు రిషి. అంతలోనే రిషికి మినిస్టర్ గారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..

Savitha S

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.