Categories: EntertainmentLatest

Guppedantha manasu serial: కొత్త దంపతులతో వ్రతం చేయించాలన్న దేవయాని.. అసలు ట్విస్ట్ ఏంటో అర్థం కాక అందరూ షాక్

Guppedantha manasu serial: రిషి ధరణి దగ్గరికి వెళ్లి అన్నయ్య గురించి మాట్లాడాలని అంటాడు. కానీ ధరణి మాత్రం ఇక తన భర్త రాడని ఫిక్స్ అయినట్లు మాట్లాడుతుంది. శైలేంద్ర అన్నయ్య త్వరలోనే వస్తాడని ధరణికి భరోసా కల్పిస్తాడు రిషి. రిషి ధరణిల మాటల్ని చాటుగా వింటుంది దేవయాని. ఆ తర్వాత రిషి వసు గదికి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ వసుధార ఉండదు.

సీన్ కట్ చేస్తే.. వసు తన తండ్రికి ఫోన్ చేసి అత్తారింటి విషయాల్ని చెప్తుంది. అప్పటికే రిషి అక్కడ ఉండడం చూసి ఫోన్ కట్ చేస్తుంది వసు. నీకోసం అంతా వెతికి వచ్చాను అంటాడు రిషి. నాకోసం ఎందుకు వచ్చారు నేనే వచ్చేదాన్ని కదా అంటుంది వసు. నీకింకా ఆ అధికారం రాలేదని తేల్చి చెప్తాడు రిషి. దాంతో వసు బాధపడుతుంది. ఆ తర్వాత తమ బంధం, ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. దగ్గరున్నా దూరంగానే ఉన్నామని మదనపడతారు.

Guppedantha manasu serial: devayani had a plan

Guppedantha manasu serial: అక్కడ దేవయాని రిషిధారల కోసం వెతుకుతుంది. అపుడే వసు రిషి చేతుల్ని పట్టుకుని మాట్లాడడం గమనిస్తుంది దేవయాని. వాళ్ల మాటల్ని చాటుగా విని సంబరపడిపోతుంది. రిషి వెళ్తుంటే గుడ్ నైట్ చెప్పరా అని అడుగుతుంది వసు. అలా ఇద్దరూ బాధపడతారు రిషిధరాలు.

ఆ తర్వాత సీన్‌లో జగతి, మహింద్రలు ధరణి గురించి ఆలోచిస్తూ బాధపడతారు. శైలేంద్ర గురించి ఆలోచించాలని అనుకుంటారు. రిషి ఆలోచిస్తే శైలేంద్ర త్వరగా వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది జగతి. ఈ విషయం గురించి రిషితో టైం చూసుకుని మాట్లాడతానని హామీ ఇస్తుంది జగతి.

మరుసటి రోజు ఉదయం ఫణింద్ర ధరణిని కాఫీ తీసుకురమ్మంటాడు. కానీ దేవయాని కొత్త అవతారం ఎత్తి కాఫీ తీసుకుని రావడం చూసి అందరూ కంగుతింటారు. స్వయంగా దేవయాని అందరికీ కాఫీ అందిస్తుంది. ఆ తర్వాత ఈ రోజు మీరందరూ కాలేజికి వెళ్లడం లేదని ట్విస్ట్ ఇస్తుంది. అదేంటని అందరూ ఆశ్చర్యపోగా ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నామని అంటుంది దేవయాని. కొత్తగా పెళ్లయిన వాళ్లతో వ్రతం చేయించాలని అన్నీ సిద్ధం చేశానని చెప్తుంది.

కాలేజిలో అర్జెంటు పని ఉందని రిషి అనగా.. ఒప్పుకోదు దేవయాని. దేవయని ప్లాన్ ఏంటో అర్థం కాక వసు, జగతిలు ఆలోచనలో పడతారు. వదినగారు సడెన్‌గా ఈ ప్లాన్ చేయడమేంటని జగతిని అడుగుతాడు మహింద్ర. వదిన గారి గురించి ఏదో నెగెటివ్‌గా అనిపిస్తుందని అంటాడు మహింద్ర. మనసులోనుంచి అన్నీ తీసేసి ప్రశాంతంగా ఉండమని సూచిస్తుంది జగతి భర్తకు.

ఆ తర్వాత ధరణి, దేవయానిలు దగ్గరుండి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటారు. అపుడే దేవయని జగతిని పిలిచి తన స్వభావాన్ని చెప్పుకుంటుంది. దాంతో జగతి ఆశ్చర్యపోతుంది. ఏ ఆటంకం లేకుండా పూజం జరిపిద్దామని తోటికోడలితో చెప్తుంది దేవయాని. మరి దేవయాని ప్లాన్ ఏంటో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..

Savitha S

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.