Guppedantha Manasu: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే.. రిషి మహేంద్ర,ఫణింద్రతో మాట్లాడుతూ తనని కిడ్నాప్ చేసిన వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వారికి ప్లాన్ వివరిస్తూ రేపు ఉదయం ఈ విషయం అన్ని పేపర్లోనూ రావాలి అలాగే అన్ని ప్రెస్ వాళ్లకి ఈ విషయాన్ని పంపించండి అని చెబుతాడు. ఇక ధరిని పనిచేసుకుంటూ ఉండగా వసుధార అక్కడికి వెళ్లడంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు వసుధార రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ధరణి అంటుంది.పర్లేదు మేడం అని చెప్పగా భోంచేసారా అని ధరణి అడగడంతో ఈ గొడవలో పడి భోజనం మర్చిపోయాము అని చెబుతుంది.అయ్యో వసుధార ఇప్పుడే గిన్నెలు అన్ని కడిగేసాను ఇంట్లో వంట కూడా ఏమీ లేదు అని చెప్పడంతో పర్లేదు మేడం ఈ ఆపిల్స్ ఉన్నాయి కదా వీటితో అడ్జస్ట్ అవుతాము.
రిషి సార్ కూడా ఏమి తినలేదు. రిషి అంటే ఎంత ప్రేమ వసదారా నీకు అని ధరణి అనగా సార్ మీద ప్రేమను నేను కొలవలేను మేడం అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి రిషి వస్తారు. నాకు నా ప్రాణం కన్నా రిషి సారే ఎక్కువ అని వసుధార చెప్పగా ఆ మాటలు విని ఎంతో సంతోష పడుతూ వెళుతుంటారు.రిషి పైకి వెళ్తుండగా జగతి రిషి నీళ్లు ఏమైనా కావాలా అని అడుగుతుంది. అందుకు రిషి వద్దని చెబుతాడు. మీకు ఒక విషయం చెప్పాలి మేడం ఇదివరకే చాలాసార్లు చెప్పాను. మీ శిష్యురాలిని నాకు ఇచ్చినందుకు చాలా థాంక్స్ మేడం అనగా జగతి ఎంతో సంతోషపడుతుంది. అప్పుడు వసుధార గురించి రిషి ప్రేమగా మాట్లాడగా జగతి సంతోషపడుతుంది.
అన్ని బాగానే ఉన్నా నా విషయంలో మాత్రం నా గుండెలో ఉన్న కొరత ఎప్పటికీ తీరదు మేడం అని రిషి అనడంతో జగతి బాధపడుతుంది.ప్రేమకు ఇంత విలువ ఇచ్చి మీరు మన బంధానికి ఎందుకు దూరంగా వెళ్లిపోయారని అడగాలని ఉంది మేడం కానీ అడగలేను. మీ ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు అని చెప్పడంతో జగతి బాధపడుతుంది.ఇక మన మధ్య ఉన్న అపార్థాలు గురించి నీకు చాలా సార్లు చెప్పాలని ప్రయత్నం చేశాను కానీ నువ్వు వినే పరిస్థితిలో లేవు అంటూ జగతి మాట్లాడిన రిషి గడిచిన క్షణాలు మళ్లీ తిరిగి వస్తాయని నేను అనుకోవడం లేదు మేడం అంటూ మాట్లాడుతారు.
గతం గురించి చెప్పాల్సిన వయసు మీకు అయిపోయింది అడగాల్సిన వయసు నాకు దాటిపోయింది అంటూ మాట్లాడుతారు.అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా రిషి ఒక్క మాట నువ్వు బంధాలను కోల్పోయినట్టు నేను కూడా బంధాలను కోల్పోయాను కొడుకుతో అమ్మ అని పిలిపించుకోలేకపోయాను అంటూ జగతి బాధపడుతుంది.కనీసం ఈ విషయాన్ని గుర్తిస్తే ఈ అమ్మ పై జాలి కలుగుతుందేమో అంటూ మాట్లాడుగా రిషి అక్కడి నుంచి తన గదికి వెళ్లి జగతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే ధరణి అక్కడికి వచ్చి ఆపిల్స్ ఇస్తుంది.
ఇప్పుడు ఎందుకు వదిన మీరు తీసుకొచ్చారని అడగడంతో వసుధార పంపించింది వసుధారకు నువ్వంటే చాలా ప్రేమ ఇలాంటి అమ్మాయి దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడు అంటూ ధరణి మాట్లాడుతుంది.మరోవైపు వసుధార తన గదికి వెళుతుండగా దేవయాని అక్కడికి వెళ్లి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని మాట్లాడుతుంది. సంతోషించాల్సిన విషయం కదా మేడం అనడంతో మెడలో తాళిబొట్టు లేకుండా తిరుగుతున్నావు ఎవరైనా అడిగితే ఏం చెబుతావు అని అనగా త్వరలోనే నా మొగుడు నాకు తాళిబొట్టు కడతారు అయినా నా తాళి తెగడానికి మీరే కారణం అని చెబుతాను అంటూ వసుధార పొగరుగా మాట్లాడటంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.మీరు ఏదో చేయాలని చూశారు అది జరగలేదు సమయానికి పనింద్ర సార్ చూశారు కాబట్టి సరిపోయింది అంటూ దేవయానికి తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తుంది. వీరిద్దరి మాటలను అక్కడే ఉన్నటువంటి రిషి వింటాడు దేవయాని వెళ్లిన తర్వాత వసుధార గదికి రిషి వెళ్లగా చెప్పండి సార్ అంటుంది నిన్ను చూద్దామని వచ్చాను. ఇందాక పెద్దమ్మతో చాలా ధైర్యంగా మాట్లాడవు అనగా అందులో భయపడాల్సిన అవసరం ఏముంది సర్ నిజమే కదా మాట్లాడాను అంటూ వసుధార రిషి ఇద్దరు కబుర్లు చెబుతూ కూర్చుంటారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.