Guppedantha Manasu: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే… రిషి వసుధార ఇద్దరు కూడా గదిలో ఉండి ఎలాగా బయటికి వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సర్ ఇప్పుడు ఎలా మనం బయటకు ఎలా వెళ్లాలి అని వసుధార అడగగా ఒక్క నిమిషం ఆగు వసుధార అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే గది కిటికీ ద్వారా వీరిద్దరూ బయటపడతారు.ఇలా కిడ్నాపర్ల నుంచి తప్పించుకొని బయటకు వస్తూ ఉండగా బయట గేటు వద్ద రౌడీలు ఉంటారు.
ఎలాగైనా మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మీడియా అక్కడికి రావడంతో వారిని చూసిన రిషి మన కాలేజీ పరువు మొత్తం తీయడానికి పెద్ద ప్లాన్ చేశారు. అందుకే మన ఇద్దరిని ఒకే గదిలో బంధించి పెట్టారు అని మాట్లాడుతారు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని రిషి అనగా మన ఫోన్లు కార్ కీస్ అక్కడే ఉన్నాయి కదా సార్ అంటూ వసుధార మాట్లాడుతుంది. అవన్నీ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దామని వెళుతూ ఉండగా గాజు పెంక వసుదారకు గుచ్చుకుంటుంది.
వసుధార నొప్పితో విలవిలలాడిపోగా రిషి తన కర్చీఫ్ తో కాలికి కడతారు అయినా వసుధార నడవలేక పోతుంది. దాంతో రిషి తనని ఎత్తుకొని తీసుకెళ్తుంటాడు. మరోవైపు వసుధర,రిషి ఇంకా ఇంటికి రాకపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.నేను అరిచేది నీకు వినపడుతుంది కానీ రిషి పై నా ప్రేమ ఎవరికి అర్థం కావడం లేదు అంటూ దేవయాని ఇష్టానుసారంగా మాట్లాడటంతో పనింద్ర దేవయానిపై సీరియస్ అవుతాడు. మరోవైపు వసుధారను ఎత్తుకొని రిషి ఆటో ఆపి ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకుని పోలీసులకు జరిగినది మొత్తం వివరిస్తాడు.
ఇక ఆటోలో రిషి వసుధార ఇంటికి వెళ్లడంతో అందరూ
టెన్షన్ పడతారు. వెంటనే దేవయాని అసలేం జరిగింది అంటూ ప్రశ్నల పై ప్రశ్నలు వేస్తూ రిషిని విసిగిస్తుంది. దాంతో రిషి పెద్దమ్మ ఆగండి అని సీరియస్ అవుతాడు రిషి. మేడం వసుధార కాలికి దెబ్బ తగిలింది ఫస్టైడ్ చేయండి అని చెప్పగా ఏం జరిగింది రిషి అనడంతో జరిగినది మొత్తం చెబుతాను పెదనాన్న అని చెబుతాడు. పెద్దమ్మ మేము కావాలని లేటుగా రాలేదు. మాకు పెద్ద ప్రమాదం పొంచి వస్తుందని ఊహించలేదు. సొసైటీ ఏమవుతుందని మీరు మాట్లాడుతున్నారు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు పెద్దమ్మ తప్పు చేసే వాళ్ళు భయపడతారు మేము అలా కాదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.
మరోవైపు సౌజన్య రావు రిషి వసుధార తప్పించుకోవడంతో నువ్వు చాలా సమర్ధుడివి ఈసారి కాకపోతే ఇంకోసారి పక్కా ప్లాన్ వేస్తాను అని అనుకుంటాడు. పెదనాన్నకు మహేంద్రకు జరిగినది మొత్తం వివరిస్తే ఇంత జరిగిందా అంటాడు మరో వైపు జగతి వసుధారకు ట్రీట్మెంట్ చేస్తుంటుంది. ఇక ఇలా చేస్తున్న వారిపై తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని మహేంద్ర అనడంతోరిషి తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను అని ముందు ఇదంతా పేపర్లో వేయించాలి అంటూ ఒక ప్లాన్ వివరిస్తాడు.మరి రిషి ఏ విధమైనటువంటి ప్లాన్స్ చేస్తున్నారు అనేది రేపటి ఎపిసోడ్లో తెలియనుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.