Categories: NewsTv Serial

Guppedantha Manasu: అపార్థాలు తొలగి ప్రేమలో విహరిస్తున్న రిషి వసుధార…. కుళ్ళిపోతున్న దేవయాని!

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. ఈరోజు ఎపిసోడ్ లో జగతి మహేంద్రా ఇద్దరు మాట్లాడుతూ మనలాగే రిషి వసుధార జీవితంలో కూడా చిక్కుముడులు పడ్డాయి. వారి ప్రేమను గెలిపించుకోవడం కోసం గతంలోకి వెళ్లి పోరాటం చేశారు. అయితే ఈ పోరాటంలో వసుధార ధైర్యంగా నిలబడింది రిషి నిలబడలేకపోయాడు. అమ్మాయిలు ఏదైనా సాధించాలి అనుకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురు గెలుస్తారు అంటూ వసుధార గురించి గొప్పగా మాట్లాడుతుంది.

 

జగతి వసుధారణ పొగడటంతో మహేంద్ర మీ స్త్రీ జాతికి నేను తలవంచి నమస్కారం చేస్తున్నాను అంటూ మాట్లాడతారు.గతంలో జగతి మహేంద్ర మధ్య జరిగిన సంఘటనల గురించి మహేంద్ర మాట్లాడటంతో జగతి ఆలోచనలో పడుతుంది.అప్పుడు మహేంద్ర రిషి నిన్ను అమ్మ అని పిలవాలి అది నేను వినాలి జగతి అనగా తను నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు తను నా కొడుకే తన సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని మాట్లాడుతుంది.ఇలా సరదాగా జగతి మహేంద్ర మాట్లాడుతూ ఉండగా మరోవైపు వసుధార పిల్లలతో కలిసి గోళీలు ఆడుతూ ఉంటుంది.

 

పిల్లలు అక్క ఇది ట్రై చెయ్ అని అంటూ ఉండగా అక్కడికి వచ్చిన రిషి నేను ట్రై చేయొచ్చా అని అంటాడు అప్పుడు వసుధర మీరు ఎప్పుడు వచ్చారు సర్ అని అనడంతో నువ్వు ఒలంపిక్ గేమ్స్ కి ప్రిపేర్ అవుతున్నావ్ గా అప్పుడు వచ్చాను అని చెబుతాడు.అయినా నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు సార్. ఏమైనా జిపిఎస్ ఆడ్ చేశారా అని అనడంతో అంతకన్నా స్ట్రాంగ్ కనెక్షన్ మన మధ్య ఉంది అంటూ రిషి చెబుతాడు.మీరు జెంటిల్మెన్ సర్ అందుకే నేను ఇక్కడ ఉన్నానని కనిపెట్టారు అని వసుధార మాట్లాడుతుంది అనంతరం పిల్లలకు చాక్లెట్స్ ఇచ్చి అక్కడి నుంచి వస్తారు. మరోవైపు ధరణి వంట చేస్తుండగా దేవయాని వచ్చి వసుధార జగతి వాళ్ల గురించి అడుగుతారు అయితే అప్పుడు ధరణి తింగరి తింగరి సమాధానాలు చెప్పడంతో దేవయాని తిట్టి వెళుతుంది.

 

మరోవైపు రిషి వసుధార ఇద్దరు ఒకచోట మాట్లాడుతూ ఉండగాకళ్ళు మూసుకో వసుధార అంటే నేను ఈ ఆనంద క్షణాలను అస్సలు మిస్ అవ్వను సార్ అని చెబుతుంది. ఒక్క సెకండ్ కళ్ళు మూసుకో అని చెప్పి తనకు శాలువా గిఫ్ట్ గా ఇస్తాడు. దానిని చూసి వసుధార ఎంతో సంతోషపడుతుంది. అలాగే రిషి భుజం పై వసుధార తల వాల్చి నా మెడలో నేను తాళి వేసుకున్నప్పుడు నేను ఎంత సర్ధి చెప్పిన మీరు నా మాట వినలేదు. కానీ మన ప్రేమ మనల్ని గెలిపిస్తుందని నాకు తెలుసు. ఈ రోజు కోసం నేను ఎంతో నలిగిపోయాను, ప్రతి క్షణం మీకోసం ఎదురు చూసాను. మన మధ్య ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాకూడదు అని వసుధార చెపుతుంది ఇక ఆ సమయంలో రిషితన జేబులో నుంచి చాక్లెట్ చేసి సగం కొరికి మిగతా సగం ఇస్తాడు.

 

Guppedantha Manasu:

 

ఆలస్యం అవుతుంది వెళ్దాం సర్ అంటూ వసుధారా అనగా ఆలస్యం అవుతే కానీ అంటాడు. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుంటుందని రిషి చెబుతాడు. ఇక రిషి మాట్లాడుతూ నీకు ఒక రహస్యం చెబుతాను నువ్వు ఎవరికి చెప్పకు అని చెప్పగా నిన్ను పెళ్లి చేసుకోవాలని, పెళ్లి విషయంలో నీకంటే ఎక్కువ ఆత్రుత నాకే ఉంది అని చెప్పగా వసుధరా రిషి మాటలకు ఎంతో సంతోషపడుతుంది.

Sravani

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

4 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

5 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.