Guppedantha Manasu: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…రిషి వసుదార ఇద్దరు కలిసిపోవడంతో మీ భవిష్యత్తు ఏంటో మీ చేతుల్లోనే ఉంది. మీరే నిర్ణయించుకోండి అంటూ జగతి వారికి సలహా ఇస్తుంది. మా భవిష్యత్తు రిషి సార్ చేతిలోనే ఉంది ఆయన మాట నేను కాదనలేను అంటూ వసుధార చెప్పగా మహేంద్ర వెంటనే ఇంకెందుకు ఆలస్యం ఆ నల్లపూసలు తీసుకొని వసుధార మెడలో వేసేయ్ రిషి అంటాడు. అందుకు రిషి మాకు కాస్త సమయం కావాలి అని చెబుతాడు.
ఇక మహేంద్ర జగతి ఇద్దరు కూడా రిషి వసుధార గురించి ఆలోచిస్తూ అక్కయ్య ఎంత పని చేసిందో చూసావా మహేంద్ర ఇప్పుడిప్పుడే వారి మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి ఒకటి కావాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కయ్యఇలా చేసింది. వారిలో ఒకరు ప్రేమ కోసం పోరాడుతూ ఉండగా మరొకరు బంధం కోసం పోరాడుతున్నారు. వారిద్దరి వెళ్లే దారి ఒకటే మనసులో ఉన్న భావన కూడా ఒకటే పంతం వల్ల ఒకరి నిర్ణయాన్ని మరొకరి ఇన్ని రోజులు అంగీకరించలేకపోయారని జగతి మాట్లాడుతుంది.
మరోవైపు ఫణీంద్ర దేవయానిని ప్రశ్నిస్తూ ఉంటారు అసలు నువ్వు చేసిన పని ఏంటో అర్థం అవుతుందా ఇప్పుడే వాళ్లిద్దరూ మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ఒకటి కావాలని చూస్తున్నారు. నువ్వెందుకు ఇలా చేశావు అని ఫణింద్ర ప్రశ్నిస్తారు. అందుకు బాధ మీకు ఎవరికీ అర్థం కాలేదు రిషి కోసమే నేను ఇలా చేశాను అని దేవయాని చెబుతుంది.మరి నువ్వు వసుధార గదికి ఎందుకు వెళ్లావు అని ప్రశ్నించగా దేవయాని ఏవో అబద్ధాలు చెప్పి తనని నమ్మిస్తుంది.
మరోవైపు రిషి వసుధార చేతిని పట్టుకొని ప్రేమలో అపోహాలు తప్ప తప్పుడు అడుగులు ఉండవు ప్రేమంటేనే నమ్మకం.కానీ మన మధ్య ఎందుకో తెలియని ఆగాదాలు ఏర్పడుతున్నాయి. అయితే మనం వాటిని దాటుకొని ఒకటవ్వాలి కానీ నువ్వు అటువైపు నేను ఇటువైపు ఉండకూడదు ప్రేమను బతికించుకోవాలి అనడంతో రిషి థాంక్యూ సార్ అంటుంది.మన బంధం అనుకున్న ఆ ఉంగరం ఎక్కడో పడిపోయింది అని రిషి చెప్పడంతో తప్పకుండా నా గదిలోనే ఉంటుంది అనడంతో వెతుకుదాం పద అని చెప్పి ఇద్దరూ కూడా వసుధార గదిలో ఉంగరం కోసం వెతుకుతారు. దొరకకపోవడంతో బాధపడతారు అయితే తిరిగి ఉంగరం కనిపించడంతో సంతోషపడతారు.
ఈ ఉంగరం నా చేతికి తొడగండి సార్ అని అడగడంతో నువ్వు నాతో పాటు రా అని తన గదికి తీసుకువెళ్తాడు. అక్కడ తాళికి ఉంగరం వేసి ఒక గిఫ్ట్ కి తగిలించి ఉంటాడు. రిషి చేసిన పనికి వసుధార సంతోష పడుతూ ఉంటుంది. సరే వెళ్దాం పద అని రిషి వసుని పిలుచుకొని వెళ్లి పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తాడు. అందరూ బయటకు వచ్చి ఏమైంది అని అడగగా నేను వసుధార ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అనగా అందరూ సంతోషపడతారు ఇన్ని రోజులు నీ నుంచి ఈ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ జగతి సంతోషపడుతుంది. ఇలా రిషి తీసుకున్న నిర్ణయానికి అందరూ సంతోషపడగా దేవయాని మాత్రం లోలోపల కుళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే పంతులను పిలిపించి ముహూర్తం పెట్టించండి పెద్దమ్మ అనగా ఇప్పుడు శూన్య మాసం కదా అయిపోయాక పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను నాన్న అంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.