Guntur Kaaram: గుంటూరు కారం..సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా నుంచి తాజాగా ధమ్ మసాలా అనే సాంగ్ ప్రోమో రిలీజైంది. ఈ సాంగ్ మహేశ్ అభిమానులను ఆకట్టుకుంటున్నప్పటికీ కామన్ ఆడియన్స్ కి మాత్రం అంతగా నచ్చడం లేదు. అంతేకాదు, ఈ సాంగ్‌ని బాలీవుడ్ మూవీలో ఉన్న సాంగ్‌తో కంపేర్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్‌ని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.
దాదాపు 17 ఏళ్ళ తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడవ సినిమా వస్తుంది. అతడు, ఖలేజా వచ్చి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే, మహేశ్ కి త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్ బాగా నచ్చింది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ని ఢీల్ చేస్తున్న విధానం హీరో ఇమేజ్‌కి తగ్గట్టుగా సినిమా తీసే పద్ధతి ఆకట్టుకుంది. అందుకే, రెండు సినిమాలు ఫ్లాపైనా మళ్ళీ మూడవసారి గుంటూరు కారం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మేకింగ్ పరంగా ఇప్పుడు త్రివిక్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. అంతా బావున్నా థమన్ సాంగ్స్ పరంగా గట్టి దెబ్బేస్తున్నాడని ఇప్పుడు వదిలిన ధామ్ మసాలా అనే సాంగ్ ప్రోమో చూసి మాట్లాడుకుంటున్నారు. థమన్ అంటే కాపీ క్యాట్ అనే కామెంట్స్ ఎప్పుడూ వినిపిస్తుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుంటూరు కారం సినిమా విషయంలో ఇప్పటి నుంచే ఈ కామెంట్స్ మొదలయ్యాయంటే ఇక ఈ సినిమా సాంగ్స్ అన్నీ రిలీజై సినిమా థియేటర్స్ లోకి వచ్చాక ఇంకా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వినాల్సి వస్తుందో చూడాలి.
ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో మీనాక్షి చౌదరి సందడి చేయబోతోంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధకృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2024, సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. మరి వాటిని తట్టుకొని గుంటూరు కారం ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి. ఈ సినిమా కోసం ఇప్పటికే కొన్ని సినిమాలను పోస్ట్ పోన్ చేయించినట్టు టాక్ కూడా వినిపిస్తోంది.
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
This website uses cookies.