Guntur Kaaram : టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వచ్చిన మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లోకి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మిక్సెడ్ టాక్ వినిపిస్తోంది. దీంతో త్రివిక్రమ్ పై నెటిజన్స్ ట్రోలింగ్ షురూ చేశారు. ఇది చాలదన్నట్లు త్రివిక్రమ్ మరోసారి అడ్డంగా బుక్ అయ్యాడు. నిజానికి గుంటూరు కారం మూవీ కథ 30 ఏళ్ల క్రితానిదని నెటిజన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు.
గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఇక మూవీలో మహేష్ హైలెట్. అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ను తెరకెక్కించారు. ఇదిలా ఉంటే గుంటూరు కారం మూవీ 30 సంవత్సరాల క్రితం కథ అంటూ ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు కారం మూవీ మలయాళ చిత్రాన్ని గుర్తుకు చేస్తుందంటూ చెబుతున్నారు . ఇప్పటికే ఈ మూవీని చూసినవాళ్లు అజ్ఞాతవాసి, అల వైకుంఠపురంల, అత్తారింటికి దారేది సినిమాలన్నింటిని కలిపి కొట్టేసినట్టు ట్రోలింగ్ చేస్తున్నారు.
గుంటూరు కారం లో హీరో తల్లికి ఇద్దరు భర్తలు ఉంటారు. ఇక అజ్ఞాతవాసి సినిమాలో హీరో ఫాదర్ కి ఇద్దరు భార్యలు ఉంటారు. ఇక అత్తారింటికి దారేదిలో అత్త, అల్లుళ్ల మధ్య జరిగే క్లైమాక్స్ సీన్ ఈ మూవీలో తల్లి, కొడుకుల మధ్య జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురంలో కూడా హీరో తన ఫ్యామిలీకి దూరంగా పెరుగుతాడు. ఇవన్నింటినీ కలుపుకుని త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తీసాడని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
30 ఏళ్ల సినిమా రాజమాణిక్యంలోనూ హీరోను తల్లి వదిలేసి వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ దూరంగా హీరో గ్యాంగ్ స్టర్ గా మారి.. తన కుటుంబంలో ఏర్పడిన సమస్యలను సాల్వ్ చేయడానికి మళ్లీ వస్తాడు. ఆ మూవీలో హీరో కన్ను కూడా సరిగా కనిపించదు. గుంటూరు కారం కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. పాలిటిక్స్ కోసం తల్లి కొడుకును వదిలేసి వెళ్లడం .ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం, హీరో కన్ను దెబ్బతినడం. తల్లి కోసం హీరో మళ్లీ తల్లి దగ్గరకు రావడం. అలా ఈ మూవీని త్రివిక్రమ్ 30 ఏళ్ల క్రితం రాజమాణిక్యం స్టోరీని కాపీ కొట్టి గుంటూరు కారం తీయడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విషయాలపై దర్శకుడు త్రివిక్రమ్.. సినిమా ముందే క్లారిటీ ఇచ్చారు. ఇది ఏ సినిమాకు కాపీ కాదని… తను అనుకున్న కథను తెరకెక్కించినట్లు తెలిపారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.