Vastu Tips: సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఎంతో కష్టపడి తమ సొంత ఇంటికాలను నెరవేర్చుకుంటూ ఉంటారు. సొంత ఇంటి కల నిజమైన సమయంలో ప్రతి ఒక్కరు కూడా గృహప్రవేశం ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు అయితే గృహప్రవేశం చేసే సమయంలో చాలా మంది తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. ఇలా తప్పు చేయటం వల్ల పెద్ద ఎత్తున నష్టాలు వస్తూ ఉంటాయి అందుకే గృహప్రవేశ సమయంలో ప్రతి ఒక్కటి కూడా శాస్త్రం ప్రకారం జరగాలని చెబుతుంటారు.
గృహప్రవేశ సమయంలో మరి ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయానికి వస్తే ముందుగా గృహప్రవేశం చేయడానికి ఎంతో అనుకూలమైనటువంటి మాసాలలో మాఘ, ఫాల్గుణ, జ్యేష్ఠ , వైశాఖ మాసాలు గృహ ప్రవేశానికి చాలా శుభప్రదమైనవిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో వీలైతే గృహ ప్రవేశం కోసం ఈ తెలుగు నెలల్లో శుభ ముహర్తలను ఎంచుకోవాలి.. ఏదైనా మాసంలోని విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి తిథులు శుక్లపక్షంలో గృహ ప్రవేశానికి మంచిది.
కొత్త ఇంట్లోకి చేరే సమయంలో తప్పనిసరిగా నక్షత్రం తిథి వారం వంటివి తప్పనిసరిగా చూసుకోవాలి. అందుకే పండితులను కలిసి వారి చేత ముహూర్తం పెట్టించుకుని పూజా కార్యక్రమాలు గృహప్రవేశం చేయాలి అయితే గృహప్రవేశం చేసే సమయంలో ముందుగా ఆవుని ఇంటిలోకి తీసుకువెళ్లాలి అనంతరం యజమాని ఇంట్లోకి అడుగు పెట్టాలి. ఇక వివాహమైన వారు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో తప్పనిసరిగా జంటగా అడుగు పెట్టాల్సి ఉంటుంది ఒంటరిగా గృహప్రవేశం చేయకూడదు అలాగే గృహప్రవేశం చేసిన రోజు రాత్రి ఆ ఇంట్లోనే పడుకోవాలి అదేవిధంగా 40 రోజులపాటు ఇంటిని కాళీగా ఉంచకూడదు. ఆ ఇంట్లో 40 రోజులపాటు ఉండటం మంచిదని పండితులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.