Goutami : సినీ రంగం ఓ రంగుల ప్రపంచం. ఈ వెండితెరపై ఎంతో మంది తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రీల్ లైఫ్ లో ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్లు పోషించిన తారలు.. రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మరీ ముఖ్యంగా తమ అందంతో, యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న హీరోయిన్లు రియల్ లైఫ్ లో ప్రేమ, పెళ్లి, విడాకులు, బ్రేకప్ వంటివాటితో డిడ్రెషన్ లో కి వెళ్లిపోతంటారు. కొంత మంది వాటి నుంచి బయటపడి నార్మల్ లైఫ్ లోకి వచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారే సీనియర్ నటి గౌతమి. సూపర్ స్టార్ కమల్ హాసన్ తో బ్రేకప్ సంఘర్షణలో పడిపోయిన గౌతమి ఇప్పుడిప్పుడే తమ బాధ నుంచి బయటపడుతున్నారు. ఈ క్రమంలో నటి తన జీవితంలో ఎదురైన పరిస్థితులను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
దక్షిణ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది గౌతమి. చిన్న వయసులోనే ఆమె బిజినెస్ మెన్ సందీప్ భాటియాను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ సుబ్బలక్ష్మి అనే పాప పుట్టింది. అయితే బిడ్డ పుట్టిన సంవత్సరానికే గౌతమి తన భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కొంతకాలం సింగిల్ గా ఉన్న గౌతమి.. హీరో కమల్ హాసన్ తో ప్రేమాయణం కొనసాగించింది. వీరిద్దరు కొంతకాలం లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. కానీ కొన్ని మనస్పర్థల కారణంగా 2016లో వీరు విడిపోయారు.
“నిజానికి మీ బలం మీరే. మీరు బాధలో ఉన్నప్పుడు మీకు ధైర్యం,ఓదార్పు కలిగించే వీడియోస్ చూస్తారు. కానీ ఒక్కొక్క వ్యక్తి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. ఒక్కొక్కరికి వేరు వేరు విషయాలు ఇన్స్పిరేషన్ గలిగిస్తాయి. మీ బంధం వర్కౌట్ కాలేదంటే దానికి పూర్తి బాధ్యత మీది కాదు. అలా అని బాధపడవద్దు. తండ్రి, తల్లి, కూతురు, భర్త, లవర్ ఇలా ఏ రిలేషన్ అయినా అందులో ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. అప్పుడే వారు జీవితకాలం కలిసివుంటారు. కానీ కొన్నికారణాలతో మరొకరు చేరుకోలేరు. మనకోసం ఇంత దూరం వచ్చారా అని పక్క వ్యక్తి కోసం ఆలోచిస్తుంటాం. అదే వారికి అలవాటు చేస్తాం. మనకోసమే ఇంత దూరం వచ్చానని అవతలి వ్యక్తి అనుకుంటాడు. కానీ ఒకసారి మోసం చేసిన వ్యక్తి మళ్లీ మళ్లీ మోసం చేస్తూనే ఉంటాడు. నీకోసం నేనెందుకు రావాలనుకుంటాడు.. నువ్వే వచ్చాయ్ అంటూ సలహాలిస్తాడు. ఇది నేను నా లైఫ్ లో నేర్చుకున్న ఓ గుణపాటం.అందుకే మనం ఎప్పుడూ ఆ లైన్ కు క్రాసై ముందుకెళ్లకూడదు. ప్రేమ అనేది ఎప్పుడూ ఇద్దరిలో సమానంగా ఉండాలి. అప్పుడే ఏ బంధమైనా ఎక్కువకాలం నిలుస్తుంది” అంటూ గౌతమి చెప్పుకొచ్చింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.