Gayathri Guptha : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా చేసిన మూవీ బేబి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ సాయి రాజేశ్ కు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. కానీ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ మాత్రం బేబి డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. బేబీ సినిమా స్టోరీ తనదని తన ఐడియాను సాయి కాపీ కొట్టాడని శిరిన్ ఆరోపించాడు. ఈ వివాదం గత కొన్ని రోజులుగా నడుస్తుంది. ప్రూఫ్స్ తో సహా బేబి లీక్స్ అనే ఓ బుక్ కూడా రిలీజ్ చేశాడు. ఇక ఇదే అంశంపై నటి గాయత్రి గుప్తా రియాక్ట్ అయ్యింది. ఫిదా సినిమాతో ఫేమసైన గాయత్రి ఆ తర్వాత ఐస్ క్రీమ్ 2, కొబ్బరి మట్ట, మిఠాయి వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు. అయితే బేబి స్టోరీని శిరిన్ ప్రేమించొద్దు అనే పేరుతో రాసుకున్నాడని, ప్రూఫ్స్ తో సహా గాయత్రి బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గాయత్రి మాట్లాడుతూ..” ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్ ఓ కథను రాసుకున్నాడు. ఆ కథనే కాపీ కొట్టి బేబీ సినిమా తీశాడు రాజేశ్. ప్రేమించొద్దు సినిమాకు ముందుగా నన్ను హీరోయిన్గా అనుకున్నాడు. అందుకు లుక్ టెస్ట్ కూడా చేశాడు. ఓ స్కూల్ డ్రెస్ తీసుకువచ్చి ఫోటోషూట్ కూడా చేశాడు. ఆ ఫోటోలను సాయి రాజేశ్ కు చూపించాను. ఆ ఫోటోను బేస్ చేసుకుని బేబి సినిమా తీశాడు. ఆ విషయం నాకు తెలియదు. ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. నాకు సాయి రాజేశ్ తో ఇబ్బందులు రావడం కొత్తేమి కాదు. సాయి తీసిన కొబ్బరి మట్ట సినిమాలో నేను చేశాను. అప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు.
కొబ్బరి మట్ట సినిమాకు నా రెమ్యునరేషన్ రూ.3 లక్షలు అని చెప్పాడు. కానీ కేవలం రూ.25 వేలు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత సినిమా మధ్యలోనే నేను అతని టార్చర్ తట్టుకోలేక మాయమయ్యాను. బేబి స్టోరీ ముందుగా రాసుకుంది శిరిన్. కానీ సాయి రాజేశ్ మాత్రం తానే క్రియేట్ చేశానని చెప్పుకున్నాడు. తమిళనాడులో ఎక్కడో రియల్ గా జరిగిందని చెబుతున్నాడు. ముందుగా శిరిన్, సాయి ఇద్దరూ కలిసి ఆ స్టోరీతో సినిమా తీద్దామని అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో సాయి చీట్ చేశాడు. బడ్జెట్ లేదని తెలివిగా శిరిన్ ను తప్పించాడు. గీతా ఆర్ట్స్ చాలా మంచిది. కానీ పాములాంటి సాయి రాజేశ్ ను వారు గుర్తించాలి. బేబి సినిమా కోసం సాయి ఎన్నో చీప్ ట్రిక్స్ ప్లే చేశాడు. బేబి క్యారెక్టర్ ను దారుణంగా చూపించాడు. హీరోయిన్ పై నెగిటివిటీ తీసుకొచ్చాడు. ఆమె పోస్టర్ ను కొందరు చెప్పులతో కూడా కొట్టారు. అంతగా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. టాలీవుడ్ కి సాయి రాజేశ్ ఒక మచ్చ. శిరిన్ శ్రీరామ్ కు న్యాయం జరగాలి”అని కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది గాయత్రి.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.