Garikapati – RRR: కవలకి కూడా ఇది సాధ్యం కాదు..నాటు నాటు పాటపై గరికపాటి కామెంట్స్

Garikapati – RRR: కవలకి కూడా ఇది సాధ్యం కాదు అంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటపై గరికపాటి ఊహించని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతకొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌తో అక్కడున్నవారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

garikapati-rrr-This is not possible even for twins.. Garikapati’s comments on Natu Natu song

దీంతో చిరు కూడా కాదనలేక కాసేపు అభిమానులకి ఫొటోలు దిగేందుకు ముందుకొచ్చారు. కానీ, ఇది గరికపాటికి కోపం తెప్పించింది. కాసేపు చూసి సహనం కోల్పోయి మీరు ఆ సెల్ఫీలు ఆపితే నేను మాట్లాడతాను. లేదంటే లేచి వెళ్లిపోతానని స్పందించారు. అది అప్పట్లో మెగాస్టార్‌తో పాటు అందరికీ ఇబ్బంది కలిగింది. అయితే, ఆ తర్వాత దీనిపై మళ్ళీ గరికపాటి మాట్లాడుతూ, ఆయనదే పొరపాటు అని అలా మాట్లాడకుండా ఉండి ఉండాల్సింది.. అంటూ చెప్పుకొచ్చారు.

Garikapati – RRR: కవలలు కూడా ఇంత పర్ఫెక్ట్‌గా డాన్స్ చేయలేరేమో

అప్పటి నుంచి కొందరు మెగా అభిమానుల్లో గరికపాటి అంటే కోపం ఉంది. కానీ, తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, దర్శకుడు రాజమౌళి హీరోలు రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ పర్ఫార్మెన్స్ అలాగే నాటు నాటు పాటలో వాళ్ళ డాన్స్ గురించి మాట్లాడుతూ, ఇద్దరు హీరోలపై ప్రశంసలు కురిపించారు. కవలలు కూడా ఇంత పర్ఫెక్ట్‌గా డాన్స్ చేయలేరేమో అని అది కేవలం తారక్, చరణ్‌లకి మాత్రమే సాధ్యమైంది.. అని మాట్లాడారు.

గరికపాటి నరసింహారావు గారు చేసిన ఈ కామెంట్స్ అటు మెగా అభిమానుల్లో ఇటు నందమూరి ఫ్యాన్స్‌లో ఆనందాన్ని నింపాయి. దాంతో అందరూ గరికపాటిని పొగడ్తలతో ముంచేస్తున్నారు. కాగా, 95వ అకాడమీ అవార్డులు (ఆస్కార్ 2023) మార్చ్ 13న ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వారితో పాటుగా భారతీయులు కూడా ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.