Vinayaka Chavithi: ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు అయితే వినాయక చవితి మరొక వారం రోజులలో రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే హడావిడి మొత్తం జరుగుతుంది. పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు చేయడం వినాయకుడు విగ్రహాలను కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నారు. అయితే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో వినాయకుడి ప్రతిష్టిస్తూ ఉంటారు. ఇలా వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించడం కోసం రంగురంగుల వినాయకుడి విగ్రహాలను తీసుకువస్తూ ఉంటారు.
ఇక మార్కెట్లో ఎన్నో రంగురంగుల వినాయకుడి విగ్రహాలు ఉంటాయి నిజానికి ఎలాంటి రంగులు లేకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలు తీసుకువచ్చి పూజించడం ఎంతో మంచిది. ఇలా మట్టి వినాయకుడి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ కాలుష్యం జరగదు. అందుకే మట్టి వినాయకుడుకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక రంగు వినాయకుడిని తీసుకురావాలి అంటే ఆకుపచ్చ వినాయకుడిని తీసుకువచ్చి ఉత్తర దిశలో ప్రతిష్టించడం ఎంతో మంచిది. నలుపు రంగు వినాయకుడిని ఎప్పుడు కూడా తీసుకురాకూడదు.
జీవితంలో సంతోషం, శాంతి, గణపతి ఆశీస్సులు పొందడానికి ఇంట్లో తెల్లటి రంగు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించండి. ఈ రంగు గణపతిని వాయువ్య దిశలో ఉంచాలి. ఇక వాస్తు దోషాలు తొలగిపోవడం కోసం గణేశుని విగ్రహాన్ని పూజా గదిలో, వంటగదిలో, ఇంట్లోని ఆఫీసులో ప్రతిష్టించడం శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంట్లో ప్రతిష్టించే వినాయకుడి విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండకూడదు. 6 అంగుళాలకు మించి ఉండకూడదు అలాగే ఎడమవైపు తొండం తిరిగి ఉన్న వినాయకుడిని తీసుకురావడం మంచిది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.