Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను సెప్టెంబర్ 7వ తేదీ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఊరువాడ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజిస్తూ ఉన్నారు. అయితే వినాయక చవితి పండుగ రోజు విగ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పువ్వులు పండ్లను సమర్పించి పూజించాలి అనంతరం స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వల్ల గణేశుడి అనుగ్రహం మన పైనే ఉంటుంది.
వినాయక చవితి రోజు ముఖ్యంగా కొన్ని పనులను చేయటం ఎంతో మంచిది అలాగే వినాయకుడికి పూజ చేసే సమయంలో ఏ రంగు దుస్తులను ధరించడం మంచిదనే విషయాల పట్ల చాలా మంది సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి వినాయక చవితి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించడం ఎంతో మంచిది. అయితే వినాయక చవితి పండుగ శనివారం వచ్చిన నేపథ్యంలో శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన నీలి రంగు దుస్తులను ధరించడం మంచిది.
వినాయక చవితి పండుగ రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఉండ్రాళ్లు. ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా కచ్చితంగా ఉండ్రాళ్లను పెట్టాలి. బొబ్బట్లు కూడా పెడితే మంచిది, మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను తయారుచేసి స్వామివారికి నివేదించాలి.రేపు ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్యలో ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూజ చేసుకోలేని వారు సాయంత్రం 6:22 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో పూజ చేసుకోవచ్చు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.