Funeral Rituals: ఒక మనిషి పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు ఆ వ్యక్తికి సంబంధించిన ఏ కార్యం జరిగిన ప్రతి ఒక్కటి సాంప్రదాయపద్ధంగా జరగాలని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కటి సాంప్రదాయ ప్రకారం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మనిషి చివరి దశ అంటే చనిపోయిన తర్వాత అంత్యక్రియలను కూడా సంప్రదాయ ప్రకారమే చేస్తూ ఉంటారు. అయితే ఈ అంత్యక్రియలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుగుతూ ఉంటాయి.
కొన్ని ప్రాంతాలలో స్మశాన వాటికలోకి మహిళలు వెళ్లారు అయితే మరికొన్ని ప్రాంతాలలో అంత్యక్రియల సమయంలో మహిళలు కూడా పాల్గొంటూ ఉంటారు. కొన్నిచోట్ల దహన సంస్కారాలు చేయగా మరికొన్ని చోట్ల చనిపోయిన వ్యక్తిని పాతి పెడుతూ అంత్యక్రియలను నిర్వహిస్తుంటారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అంత్యక్రియలను చేస్తూ ఉంటారు. అయితే అంత్యక్రియల సమయంలో పాల్గొన్న వారు ఎవరు కూడా అంత్యక్రియలు పూర్తి కాగానే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లాలని కొన్నిచోట్ల పెద్దలు చెబుతూ ఉంటారు.
ఇలా అంత్యక్రియల సమయంలో వెనక్కి ఎందుకు తిరిగి చూడకూడదు అలా చూడటం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…ఒక వ్యక్తి అంత్యక్రియలను పూర్తి చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడటం వల్ల చనిపోయిన వారి ఆత్మ వారిని ఆవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ వ్యక్తికి తమంటే ప్రేమ ఉండటం వల్లే తమ కోసం వెనక్కి తిరిగి చూస్తున్నారు అన్న ఉద్దేశంతో వారితో పాటు ఇంటికి రావడానికి ఆత్మలు ప్రయత్నిస్తాయట. తమ మరణం కారణంగా ఆ వ్యక్తి మాత్రమే విచారంగా ఉన్నారని ఆత్మ భావిస్తుంది దీంతో ఆత్మశాంతి ఉండదట.అందుకే అంత్యక్రియల తర్వాత ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడకూడదు అని పెద్దవారు చెబుతూ ఉంటారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.