Fish Venkat: ఇదీ అసలు విషయం..అందుకే చనిపోయాడు..

Fish Venkat: టాలీవుడ్‌లో తనదైన హాస్య శైలితో ప్రేక్షకులను మెప్పించిన నటుడు ఫిష్ వెంకట్ (వయసు 53) ఇకలేరు. మూత్రపిండ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలూ పూర్తిగా చెడిపోవడంతో డయాలసిస్ చికిత్స పొందుతున్నారు.

వైద్యుల సూచన మేరకు కిడ్నీ మార్పిడి అవసరమని ఆయన కుమార్తె ఇటీవల మీడియా ద్వారా వెల్లడించారు. కుటుంబ ఆర్థిక పరిమితుల కారణంగా, సాయం కోరుతూ ఆమె అప్పీల్ చేసిన సమయంలోనే వెంకట్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. అయితే, ఎంతో ఆశగా ఎదురుచూసిన సమయంలో ఆయన మరణం సినీ పరిశ్రమకు, అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

నటనా ప్రస్థానం..
ఫిష్ వెంకట్ తన నటనా జీవితంలో 100కి పైగా సినిమాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, మిరపకాయ్, సుప్రీమ్, డీజే టిల్లు వంటి పాపులర్ చిత్రాల్లో వెంకట్ తన ప్రత్యేకమైన తెలంగాణ యాస, టైమింగ్ కామెడీతో హాస్యాన్ని పంచారు. ఆయన నటించిన చివరి సినిమా కాఫీ విత్ ఏ కిల్లర్.

fish-venkat-this-is-the-real-thing-thats-why-he-died

Fish Venkat: ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేశ్.

‘ఫిష్ వెంకట్’గా ఎలా మారారు?..
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేశ్. మచిలీపట్నం ఆయన స్వస్థలం. మొదట్లో చేపల వ్యాపారం చేసేవారు. అందుకే ఆయనను ‘ఫిష్ వెంకటేశ్’గా పిలిచేవారు. తర్వాత అదే పేరు ఫిష్ వెంకట్‌గా స్థిరపడిపోయింది. 1989లో ఓ స్నేహితుడి ద్వారా నిర్మాత మాగంటి గోపినాథ్ పరిచయం కావడం ఆయన సినీ ప్రయాణానికి ఆరంభమైంది. 1991లో ఆయన నిర్మించిన ‘జంతర్ మంతర్’ సినిమాలో తొలిసారి నటించారు.

కానీ 2002లో ఎన్టీఆర్ హీరోగా నటించిన వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఆది చిత్రంతోనే ఫిష్ వెంకట్‌కు నిజమైన గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంతో ఆయన సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారని, వీవీ వినాయక్ తనకు గాడ్‌ఫాదర్ అని ఎన్నోసార్లు చెప్పారు. అలాగే శ్రీహరి కూడా తనను ఎంతో ప్రోత్సహించారని ఆయన గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం వెంకట్ కుటుంబం హైదరాబాద్‌లోని రాంనగర్‌లో నివసిస్తోంది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఫిష్ వెంకట్ మరణ వార్తతో టాలీవుడ్‌లోని ఆయన సన్నిహితులు, అభిమానులు, సహనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతని మరణం తెలుగు చిత్రసీమకు తీరని నష్టం.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.