Health: నడుము నొప్పి రావడం అనేది ప్రస్తుత కాలంలో నూటికి తొంభై మందిలో చూస్తూ ఉన్నాం. ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కాని, నిద్రలో కాని, ఎలాంటి ప్రయాణ సమయాలలో కాని, కూర్చొని గంటల తరబడి పని చేస్తున్నప్పుడు కాని నడుపు నొప్పులు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ఈ నడుము నొప్పి వచ్చినపుడు తట్టుకోలేని స్థాయిలో దాని తీవ్రత ఉంటుంది. దీంతో వెంటనే భయంతో డాక్టర్లని ఎక్కువ మంది సంప్రదిస్తూ ఉంటారు.
అయితే ప్రస్తుత కాలంలో మన రోజువారి తినే ఆహారం శరీరంలో ఐరన్ సామర్ధ్యాన్ని పెంచకపోగా మరింత కండరాలు, ఎముకుల పటుత్వాన్ని దెబ్బ తీస్తున్నాయి. అలాగే సాఫ్ట్ వేర్ కొలువులు వచ్చిన తర్వాత గంటల తరబడి పైకి లేవకుండా కూర్చొని పనులు చేయడం కూడా ఈ నడుము నొప్పులు రావడానికి ఒక కారణం అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలా వచ్చే నడుము నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది అప్పటికప్పుడు రిలాక్స్ కోసం పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటారు.
ఈ పెయిన్ కిల్లర్స్ ఒక డ్రగ్స్ లా పని చేసి అవి మరింతగా శారీరక సామర్ధ్యాన్ని తగ్గించేస్తాయి. దీంతో వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ కి దూరంగా ఉండమని డాక్టర్లు సూచిస్తారు. అయితే నడుము నొప్పులకి వెంటనే పరిష్కారం లేకున్నా కొన్ని వ్యాయామాలు, ఆహారపు అలవాట్లు, రోజువారి పద్దతుల వలన తగ్గించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నడుము నొప్పి వచ్చినపుడు పెయిన్ కిల్లర్స్ వాడకుండా వేడి నీటితో నొప్పి ఉన్న చోట కొంత సేపు కాపురం పెట్టడం వలన కొంత వరకు ఉపశమనం లభిస్తుంది.
అలాగే వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. వీటితో పాటు ఆ నొప్పిని తగ్గించుకోవడం కోసం చిన్న చిన్న ఎక్సర్ సైజ్, యోగాసనాలు ప్రాక్టీస్ చేయాలి. శరీరానికి అధిక శ్రమ లేకుండా ఉన్న వ్యాయామాలు చేయడం వలన ఉపశమనం దొరుకుతుంది. వెన్నెముక సమస్య వలన వచ్చే నడుము నొప్పులు అయితే దాంతో పాటు వికారం, జ్వరం, ఆయాసం, నీరసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్లని సంప్రదించడం ఉత్తమం. కేవలం నడుము నొప్పి మాత్రమే ఉన్నవారు వెన్నెముక బలాన్ని ఇచ్చే వ్యాయామాలు చేయడం వలన మెల్లగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.