Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతోంది. కానీ, ఈ విషయాన్ని స్వయంగా హీరో రామ్ చరణ్ చెప్పినా కూడా ఫ్యాన్స్ నమ్మడం లేదు. దీనికి కారణం ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ కావడమే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

పెద్ది సినిమా ప్రారంభమైనప్పుడు అంచనాలున్నప్పటికీ, ఈ రేంజ్‌లో పెరుగుతాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎప్పుడైతే పెద్ది ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ షాట్ వదిలారో.. అప్పుడు ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక, చికిరి చికిరి సాంగ్ తర్వాత ఇదేదో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్ఠించే సినిమానే.. అని మాట్లాడుకోవడం మెదలుపెట్టారు. రామ్ చరణ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం కూడా మొన్నటి వరకూ దర్శకుడు బుచ్చిబాబు సీక్రెట్ గా ఉంచాడు.

fans-dont-believe-ram-charans-statement-about-peddis-release

Peddi Movie: చరణ్‌ని అభిమానులు పెద్ది రిలీజ్ గురించి అడిగారు.

ఇటీవల వచ్చిన టీజర్‌తో, ఇందులో చరణ్ పోషిస్తున్నది రెండు పాత్రలని క్లారిటీ వచ్చింది. అప్పటి నుంచి అభిమానుల్లోనే కాకుండా.. ఫిల్మ్ సర్కిల్స్‌లో, సినీ ప్రేమికుల్లో సిల్వర్‌ స్క్రీన్ మీద పెద్ది ప్రభంజనం చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాస్తవానికి, మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు పెద్ది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టిగానే ప్రయత్నించారు. కానీ, కొన్ని పనులు పూర్తికాకపోవడంతో ఏప్రిల్ చివరికి వాయిదా వేశారు. అయితే, ఇటీవల ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో నేరుగా చరణ్‌ని అభిమానులు పెద్ది రిలీజ్ గురించి అడిగారు.

దానికి సమాధానంగా చరణ్ ఖచ్చితంగా ఏప్రిల్ 30న మీ ముందుకు వస్తుందని హామీ ఇచ్చారు. కానీ, ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇంకా పెద్ది చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. ఇదే, అభిమానులకి చేరి పలు సందేహాలు కలుగుతున్నాయి. మళ్ళీ, పెద్ది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, జూన్ నెలలో రిలీజ్ ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇది, ఏప్రిల్ నెల ప్రారంభమే కాబట్టి, మరో వారం పది రోజుల్లో మేకర్స్ నుంచి పెద్ది రిలీజ్ విషయంలో కన్‌ఫర్మేషన్ రావచ్చు. ప్రమోషన్స్ మొదలయ్యేదాన్ని బట్టి అందరూ పెద్ది వచ్చేది ఇదే నెలలోనా లేక మరోసారి పోస్ట్ పోన్ అవుతుందా..అనేది తేలిపోతుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

43 minutes ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

12 hours ago

Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్

Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…

2 days ago

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

4 days ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

5 days ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

6 days ago

This website uses cookies.