Extra Ordinary Man Movie Review: విడుదల తేదీ : డిసెంబర్ 08, 2023
నాతెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్, రావు రమేష్, రోహిణి, పవిత్ర నరేష్, హైపర్ ఆది తదితరులు
సంగీతం: హారిస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
దర్శకుడు : వక్కంతం వంశీ
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
Extra Ordinary Man Movie Review: నేచురల్ స్టార్ నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. డిఫరెంట్ కథా చిత్రాలలో వచ్చి ఆకట్టుకుంటుంటాడు. గత చిత్రం దసరా 100 కోట్ల మార్క్ ని దాటింది. దాంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు హాయ్ నాన్న అంటూ వచ్చిన నాని ఏ మేరకు హిట్ సాధించాడు..అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
యూత్ స్టార్ నితిన్, శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా-ఆర్డినరీ మేన్ ట్యాగ్ లైన్. రచయిత దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
అభి (నితిన్) జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంటాడు. హీరో అవ్వాలనేది అతని గోల్. కానీ అందరికంటే వెనకాలే ఉండిపోతాడు. ఇలా ప్రతీదాంట్లో ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా మిగిలిన అభి జీవితంలోకి లిఖిత (శ్రీలీల) ప్రవేశిస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో అభికి అనుకోకుండా హీరో గా అవకాశం వస్తుంది. ఆ తర్వాత జరిగే కొన్ని రెగ్యులర్ సన్నివేశాలి అభి, సైతాన్ పాత్రలోకి ప్రవేశిచడం జరుగుతాయి. ఈ సైతాన్ ఎవరు?, అభి సైతాన్ గా ఎందుకు మారతాడు ?, ఐజీగా నటించిన విజయ్ చక్రవర్తి (రాజశేఖర్) రోల్ ఏంటీ? అభి, లిఖిత పెళ్లి చేసుకున్నారా లేఆ అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఒక జూనియర్ ఆర్టిస్ట్ నిజ జీవితంలో హీరోగా మారే నేపథ్యంలో వచ్చే డ్రామా..కామెడీ, యాక్షన్ సీన్స్ అలాగే, ఇంటర్వెల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నితిన్ తన పర్ఫార్మెన్స్ తో బాగా నటించాడు. అలాగే, మొదటిసారి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన రాజశేఖర్ కూడా తన పాత్రకి న్యాయం చేశారు. హీరోయిన్ గా నటించిన శ్రీలీల గ్లామర్ పరంగా ఓకే గానీ చెప్పుకోవడానికి ఏమీలేదు. నితిన్ – రావు రమేష్ మధ్య వచ్చే సీన్స్ నవ్విస్తాయి.
మైనస్ పాయింట్స్ :
ఎక్స్ట్రా సినిమాకి ఎంచుకున్న మెయిన్ పాయింట్ బావున్నప్పటికీ దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు వక్కంతం వంశీ ఫెయిల్ అయ్యాడు. మొదటి భాగంలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని రెండవ భాగంలో లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ అయ్యాయి. ఎప్పుడు కూడా సినిమాలో సెకండ్ హాఫ్ ఉత్కంఠభరితంగా సాగాలి. అదే లోపించింది. దాంతో ఎక్స్ట్రా అనుకున్నది కాస్త అసలు ఏమీలేనట్టు కనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
టెక్నికల్ గా చూస్తే..ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో హారిస్ జయరాజ్ సంగీతం వరకూ బాగానే ఉంది. అదే ప్లస్ అయిందనుకోవాలి. ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్ అనుకోవాలి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా పరవాలేదు. నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
ఫైనల్‌గా:
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథ కథనం లోపించడం వల్ల పెద్దగా ఆకట్టుకోదు. కొన్ని కామెడీ సీన్స్ తప్ప మేయిన్ పాయింట్ జనాలకి ఎక్కదు. ఓవరాల్ గా చూస్తే నితిన్ తప్ప సినిమాకి కలిసొచ్చే అంశం ఏదీ కనిపించదు. ఇలాంటి సినిమాలను ఢీల్ చేయడం కత్తిమీద సాము. ఆ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.