Etela Rajendar: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో ఈటెల రాజేందర్ ఉండేవారు. అయితే తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవిని కోల్పోయారు. చివరికి అవినీతి, భూ ఆక్రమణల ఆరోపణలు కూడా వచ్చాయి. వాటిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఈటెల రాజేందర్ ని దూరం పెట్టడం మొదలు పెట్టింది. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈటెల బీజేపీలోకి వెళ్ళారు. అక్కడ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి మరల ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. మంచి ప్రాధాన్యత కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో ఈటెల రాజేందర్ కి పొసగడం లేదనే మాట వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా ఈటెల రాజేందర్ తమ పార్టీలోకి రాబోతున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లోకి వస్తే కచ్చితంగా బలం పెరుగుతుందని భావిస్తున్నారు. బీజేపీలో కూడా అంతర్ఘతంగా ఈ చర్చ నడుస్తుందనే మాట వినిపిస్తోంది. అలాగే జూపల్లి కృష్ణారావు లాంటి వారు బీజేపీ నుంచి బయటకి రమ్మని తాము కోరినట్లు ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే తాను మారే ప్రశ్న లేదని ఈటెల రాజేందర్ మాత్రం తేల్చేశారు. తనపైన కావాలనే విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీలో తనకి సముచిత స్థానం ఉందని చెబుతున్నారు. కేవలం రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. అయితే తనకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందడం మాత్రం వాస్తవమే అని పేర్కొన్నారు. మొత్తానికి ఎన్నికల ముందు తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.