Categories: LatestMost ReadNews

Technology: ఎలాన్ మాస్క్ ఎత్తుగడ… ఆ ఒక్క బ్లూ టిక్ తోనే కోట్ల ఆదాయం

Technology:  ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యుగంలో ట్విట్టర్, పేస్ బుక్ అతిపెద్ద సామాజిక మాధ్యమాలుగా ప్రజలకి చేరువగా ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు, వ్యాపారుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ తన వాయిస్ ని ప్రజలకి వినిపించేందుకు పేస్ బుక్ గతంలో ఉపయోగించేవారు. అయితే పేస్ బుక్ లో భద్రత ప్రమాణాలు తక్కువగా ఉండటంతో ట్విట్టర్ లోకి చాలా మంది సెలబ్రెటీలు షిఫ్ట్ అయిపోయారు.

ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీలు అందరూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. అలాగే వ్యాపారులు తమ ఉత్పత్తులని ప్రమోట్ చేసుకోవడానికి, రాజకీయ నాయకులు తమ స్వరాన్ని ప్రజలకి చేరవేయడానికి ట్విట్టర్ ని ప్రధాన మాధ్యమంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ట్విట్టర్ వన్ సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. రాజకీయ పార్టీలు ట్విట్టర్ ని తమ ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నాయి. సెలబ్రెటీలని, రాజకీయ,.వ్యాపార దిగ్గజాలు ట్విట్టర్ లో తమ అఫీషియల్ ప్రొఫైల్ కోసం బ్లూ టిక్ మెయింటేన్ చేస్తున్నాయి.

ట్విట్టర్ యాజమాన్యం గతంలో ప్రముఖులు అందరికి బ్లూ టిక్ మార్క్ ని ప్రొఫైల్ వెరిఫై చేసి ఉచితంగా అందిస్తూ ఉండేది. ట్విట్టర్ లో ప్రకటనల ద్వారా, అలాగే సెలబ్రెటీ ప్రముఖుల ఫాలోవర్స్ ద్వారా ఎక్కువ యూజర్స్ ని సంస్థ పెంచుకుంది. అలాగే ఆదాయం కూడా పెంచుకుంది. అయితే ఎలాన్ మాస్క్ చేతిలోకి ట్విట్టర్ వచ్చిన తర్వాత ముందుగా సీఈవోని, అలాగే మరికొంత మంది కీలక ఎగ్జిక్యుటివ్స్ ని తొలగించారు. ఇక ఇప్పుడు భారీ ఎత్తున ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. ఈ నేపధ్యంలో చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు.

రెండు నెలల పే ఆఫ్ ఇచ్చేసి వారిని ఇంటికి పంపించేస్తున్నారు. అలాగే కొన్ని ప్రధాన కార్యాలయాలని మూసేస్తున్నారు. కొన్ని భద్రతాపరమైన మార్పులలో భాగంగా మోసేస్తున్నట్లు ఉద్యోగులకి మెయిల్స్ పంపిస్తున్నారు. మరో వైపు ట్విట్టర్ ని టేకోవర్ చేసిన ఎలాన్ మాస్క్ తాను పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా వసూలు చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇకపై బ్లూ టిక్ మార్క్ కావాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాలనే నిబంధనని తీసుకొచ్చారు. బ్లూ టిక్ మార్క్ కోసం 8 డాలర్ల రుసుము నిర్ణయించారు.

ఇక ఈ బ్లూ టిక్ మార్క్ ని ఎక్కువగా సెలబ్రెటీ ప్రముఖులు మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి వారికి ఇది పెద్ద మొత్తం కాదు. ఇక ఈ బ్లూ టిక్ మార్క్ ద్వారా ప్రతి నెల 29 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే భవిష్యత్తులో క్యాంపైన్స్ కోసం కూడా ప్రత్యేకమైన రుసుముని నిర్ణయించేందుకు ఎలాన్ మాస్క్ సిద్ధం అవుతున్నారని కార్పొరేట్ వర్గాలలో వినిపిస్తుంది. ట్విట్టర్ వినియోగాన్ని ఎలాన్ మాస్క్ కాస్ట్లీ వ్యవహారంగా మార్చడం వలన భవిష్యత్తులో దీనిని యూజర్స్ తగ్గిపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.