Egg: సాధారణంగా ప్రతిరోజు ఒక గుడ్డు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. ఇలా గుడ్డును తరచూ తీసుకోవడం వల్ల గుడ్డులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి అంది ఎంతో దృఢంగా ఆరోగ్యంగా తయారవుతాము. అయితే చాలా మంది ఎగ్ తినడానికి ఇష్టపడినప్పటికీ అందులో ఎల్లో కలర్ తినడానికి ఏమాత్రం ఇష్టపడరు కేవలం వైట్ ఎగ్ మాత్రమే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.
ఈ విధంగా మీరు కనుక ఎగ్ తినేటప్పుడు ఎల్లో కలర్ వదిలేసి వైట్ మాత్రమే తిన్నట్లయితే మీరు పూర్తి పోషకాలను పొందలేరనే నిపుణులు చెబుతున్నారు. ఎగ్ పూర్తిగా తిన్నప్పుడే అందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి పుష్కలంగా అందుతాయి.గుడ్డు తెల్లసొనలో కంటే పచ్చసొనలో పోషకాలు అధికంగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ, కె, బి6, బి12, క్యాల్షియం, జింక్, రైబోప్లేవిన్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి.
గుడ్డు పచ్చసొనను తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. పిల్లలల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే ఫోలిక్ ఆసిడ్ ఎక్కువ భాగం గుడ్డు పచ్చ సోనలోనే ఉంటుంది అందుకే ఈ పచ్చ సొన తీసుకోవటం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఒకవేళ పచ్చ సొన వదిలేయడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటిని పూర్తిగా కోల్పోతారు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.