Culture: సాంప్రదాయం అంటే చాలా గొప్ప విషయం. ఇది ఒక కుటుంబానికి సంబంధించింది. వంశానికి సంబంధించింది. కుటుంబానికి కుటుంబానికి సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. మనుషులను కాపడే గొప్ప కవచం సాంప్రదాయం. సాంప్రదాయం ఎంత గొప్పదంటే మన వెనకాల ఓ శక్తిలా ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. మన పూర్వికులు, తాతలు, ముత్తాతలు అనాదిగా ఎన్నో పద్ధతులు, నియమాలను పాటిస్తూ ఉండేవారు.
అవి వారి జీవనంలో భాగం చేసుకున్నారు. సాంప్రదాయాలు, ఆచారాలు, దైవా రాధనలు ఇలా అన్నింటిని వారి నుంచి వారి తరువాత వారికి చేరవేస్తూ హిందూ సాంప్రదాయల ను రక్షిస్తూ వస్తున్నారు. గత 10 , 20 ఏళ్లుగా గమని స్తుంటే ఈ సాంప్రదాయపు జాడలు కనుమరుగవుతున్నాయా అన్న అనుమానాలు నెలకొంటున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ఇప్పటి తరానికి అసలు సాంప్రదాయం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఉద్యోగంలో ఎలాగైతే రూల్స్ , రెగ్యులరేషన్స్ ఉంటాయో అదే విధంగా సాంప్రదా యాలు కూడా ఉంటాయి. ఈ టైం కి రావాలి, ఈ డ్రెస్ కోడ్‌లో రావాలి. ఈ టైంలో ఈ పని చేయాలి , ఇన్ని రోజులు పనిచేయాలి, రోజులో ఇన్ని గంటలు పని చేయాలి అన్న కండీషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే ఆ సంస్థ లేదా ఫ్యాక్టరీ లేదా ఏదైనా అభివృద్ధి వైపు అడుగులు వేయడానికే. ఏదైనా సమస్య వస్తే వాటిని కలిసి కట్టుకగా ఎదుర్కొవడానికే ఇన్ని పద్ధతులు, కండీషన్స్‌ను పెడతారు. అదే విధంగా మన పెద్దలు కుటుంబ వృద్ధికి, వంశం వృద్ధికి, రాబోయే తరం హాయిగా ఉండేందు కు, సంతోషకరమైన జీవితాన్ని అనుభవించేందుకు, కష్టాలు వస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఎవరూ కుమిలిపోకుండా, క్రుంగిపోకుండా ఒక శక్తిగా నిలబడాలనే కొన్ని నియమాలను, పద్ధతులను ఏర్పాటు చేసుకున్నారు.
వాటిని వారు అనుసరించారు ఆ తరువాతి తరం వారికి అందించారు. ఇదంత ఓ 20 ఏళ్ల కిందటి మాట. అప్పట్లో తండ్రి తరువాత కొడుకు అవి తెలుసుకుని వంశపారపర్యం గా అవే పద్ధతులను సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ వచ్చారు. ఇలా వంశంలోని ప్రతి ఒక్కరు ఒకటే విషయాన్ని పాటించడం వల్ల ఒక శక్తి వస్తుందన్న ది వారి విశ్వాసం. ఈ శక్తి సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగ పడుతుందని వారి నమ్మకం. కాబట్టి మనం ఎప్పుడూ సాంప్రదాయాలను వదలకూడదు. వాటిని ఎప్పటికీ పాటిస్తూ ఉండాలి. ఇదొక పెద్ద వృక్షం లాంటిది. ఇలా సాంప్రదాయాలను కొనసాగించడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదాలు మనకు లభిస్తాయని పెద్దలు చెబుతుంటారు.
కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, మన నాన్నలు, తాతలు, ముత్తాతలతో కూర్చు ని మాట్లాడం, వారితో ఎక్కువ సమయం గడపడం, వారి నుంచి విషయాలను తెలుసుకోవడం చాలా తక్కువైంది. ఏం తెలుసుకోవాలన్నా టెక్నాలజీ ఉందని , సోషల్ మీడియా ఉందని మరమెషిన్‌ల చుట్టూ తిరుగుతారు కానీ మన పెద్దలతో చర్చిస్తే నామూషిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇళ్లల్లో పెద్దల నుంచి చిన్నవారి వరకు ప్రతి ఒక్కరు ఎంతో బిజీ అయిపోయారు. తెల్లారిందా లేచామా తిన్నామా ఆఫీస్‌కు వెళ్లామా అన్న ధ్యాసే తప్ప మనం ఎటు వైపు వెళ్తున్నాము, మన ఆచారాలు ఏమయ్యాయి, సాంప్రదాలయాలు ఏమవుతున్నాయి అని ఆలోచించ డం లేదు.
నిజానికి ప్రతి చిన్న విషయం కూడా పుస్తకాల్లో నిక్షిప్తమై ఉండదు. వాటిని మాటల ద్వారా చేతల ద్వారానే తెలుసుకోవాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ఎంత సేపూ పొద్దు న్న లేచిన దగ్గరి నుంచి సంపాదించాలి, ఉద్యోగానికి వెళ్లాలి, ఇంక్రిమెంట్లు సంపాదిం చుకోవాలి, ఉన్నత స్థానానికి రావాలన్న ఆలోచన తప్ప, మన పూర్వికు లు ఎలా ఉండేవారు, ఏం చేసేవారు, ఎందుకు చేసేవారు వంటి సాంప్రదాయాలను ఇప్పుడు న్న జనరేషన్ తెలుసుకోలేకపోతోంది. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని పెద్దవారితో కాస్త సమయాన్ని గడిపితే ఇప్పటి వరకు మనం ఏం కోల్పోయామో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన సాంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి.
ఒకప్పుడు పూర్వికులు దైవ ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చేవారు. పొద్దున్నే లేచి స్నానం చేసి కుల దేవుతకు పూజ చేసి దీపం పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి దైవారాధనలో సమయాన్ని గడిపేవారు. ఇప్పుడు అంత సేపు కూర్చుని పూజ చేసే అవకాశం లేదు . కాబట్టి కుల దేవతను ప్రార్ధించాలి అనే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. స్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టండి. ఐదు నిమిషాలు ప్రార్థన చేయండి. రెండు నిమిషాలు శక్తి ముందు నిలబడి ప్రార్థన చేసుకుంటే చాలు. ఎంతో మన:శాంతి లభిస్తుంది. రోజులో 24 గంటలు సంపాదన కోసం జీవనం కోసం కష్టపడుతున్నాము. సాంప్రదాయాలు, ఆచారాలు కూడా మన కోసమే అని అనుకోవాలి. వాటిని తూచాతప్పకుండా ఆచారించాలి.
వచ్చే జనరేషన్ వారు అసలు మనకు సాంప్రదాయలు ఉన్నాయా అన్న ప్రశ్న ఖచ్చితంగా లేవనెత్తుతారు. ఆ తరువాత జనరేషన్ వచ్చే సరికి చరిత్రలో ఇలాంటి పద్ధతులు, సాంప్రదాయాలు పాటించేవారు అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల మన వంశానికి లింక్ తెగిపోతుంది. ఒక వృక్షపు నీడ పోతుంది. కాబట్టి కేవలం చదువులు, మెడల్స్, డిగ్రీలు, పీజీలు చదవమని సంపాదించమని, అబ్రాడ్ వెళ‌్లమని నెత్తినోరు కొట్టుకోకుండా ప్రశాంతంగా పిల్లలతో రోజులో కాస్త సమయాన్ని గడపండి. వారి దగ్గర కూర్చుని మన పెద్దలు ఏం చేసేవారు, మనం ఏం చేయాలో వారికి తెలపండి.
పెద్దలకు గౌరవం ఎలా ఇవ్వాలో నేర్పించండి, కష్టాలలో ఉన్న తోటి వ్యక్తికి సహాయం అందించాలన్న మనస్తత్వం కలిగి ఉండాలని అవగాహన పెంచండి. ఆధ్యాత్మిక చింతన వల్ల కలిగే మేలేంటో వివరించండి, ఇలా చేయడం వల్ల వీటిని పాటించడం వల్ల కార్పోరేట్ కోరల్లో చిక్కుకోకుండా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించి అనుకున్న లక్షాలను ఎలాంటి సమస్యలు లేకుండా సాధించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు విదేశీయులు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చు కోవడానికి ఆసక్తి చూపేవారు . ఎందుకంటే వాటి గొప్పతనం అలాంటిది కానీ ఇప్పుడు మనవారే విదేశీ కల్చర్ కు నడుం వంచుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు సాంప్రదాయాలను కొనసాగించి వంశా- భివృద్ధికి కృషి చేస్తారని ఆశిద్దాం.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.