Eating Fast: ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ప్రతి ఒక్కరు పనులలో బిజీ అయ్యారు. అయితే తినడానికి కూడా కాస్త సమయం కేటాయించడం లేదు ఏదో తినాలంటే తినాలన్న ఉద్దేశంతో ఒకవైపు పని చేసుకుంటూనే మరోవైపు తింటూ ఉంటారు. ఇలా సమయం వృధా కాకుండా చాలామంది చాలా వేగంగా ఆహారం తిని తిరిగి వారి పనులకు వెళ్తుంటారు.ఇలా వేగంగా కనుక ఆహారం తీసుకుంటూ ఉన్నట్లయితే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వేగంగా ఆహారం తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయానికి వస్తే…
పలు అధ్యయనాల ప్రకారం వేగంగా ఆహారం తీసుకున్న వారి కన్నా నిదానంగా ఆహారం తీసుకున్నటువంటి వారిలో ఆకలి చాలా తక్కువగా ఉంటుందట.ఆహారం బాగా నమిలి తినడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు శరీరానికి అంది ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది.అలా కాకుండా వేగంగా ఆహారం తినడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా నమలక పోవడం ద్వారా పోషకాలు మన శరీరానికి అందవు అంతేకాకుండా వెంటనే ఆకలి వేస్తుంది.
ఇలా వెంటనే ఆకలి వేయటం వల్ల మరలా తింటూ ఉంటే తొందరగా శరీర బరువు పెరగడమే కాకుండా అది ఊబకాయానికి దారితీస్తుంది. ఇలా వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల ఏరోసివ్ గ్యాస్టిక్ వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తొందరగా ఆహారం తినడం వల్ల తీసుకున్న ఆహారం జీర్ణం కాక ఇలాంటి గ్యాస్టిక్ సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే మనకోసం అన్నం తినేటప్పుడు కాస్త సమయం కేటాయించాలని నిదానంగా భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.