AP Politics: ఏపీ రాజకీయాలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. అధికార పార్టీ వైసీపీ బయటకి పూర్తి కాలం అధికారంలో ఉంటామని, ముందస్తుకి వెళ్ళే ఆలోచన లేదని చెబుతున్నారు. అయితే మరో వైపు నియోజకవర్గ ఇన్ చార్జ్ లతో సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్ధులని ఖరారు చేసుకుంటున్నారు. అలాగే గ్రామ సారథులని సిద్ధం చేస్తున్నారు. మరో వైపు పార్టీ కార్యవర్గంతో భేటీ అవుతూ ఎన్నికల కార్యాచరణని సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఆయా నియోజకవర్గాలలో తమకి అనుకూలంగా పని చేసే అధికారులని కూడా నియమించే ప్రయత్నం వైసీపీ అధిష్టానం చేస్తుంది.
మరో వైపు ప్రతిపక్ష టీడీపీ కూడా సైలెంట్ గా తన కార్యాచరణని సిద్ధం చేసుకుంటూ వెళ్తుంది. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉంటే మరో వైపు మరో వైపు చంద్రబాబు నాయుడు పార్టీ కార్యవర్గ సభ్యులతో మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా లేదంటే జోనల్ వారీగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులని ఖరారు చేయాలని భావిస్తున్నారు. 160 నియోజకవర్గాలలో టీడీపీ గెలుస్తుందని క్యాడర్ కి చెబుతున్నారు. అలాగే అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత పూర్తిగా తమకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.
ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అందరూ సిద్ధంగా ఉండాలి అంటూ క్యాడర్ కి సూచిస్తున్నారు. ఇక జనసేన పార్టీ కూడా ముందస్తు ఎప్పుడు వచ్చిన కూడా తాము సిద్ధం అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఏప్రిల్ నుంచి వారాహితో బస్సుయాత్ర చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీలు ముందస్తు వ్యూహాలతోనే రాజకీయ క్షేత్రంలో ముందుకి కదులుతున్నారు. మరి ఈ ప్రయాణంలో ఎవరి వ్యూహాలు బలంగా ప్రజలలోకి వెళ్తాయి అనేది వేచి చూడాలి. ఇక ఎవరి బలాబలాలు ఏంటి అనేది అందరూ కూడా రాజకీయ క్షేత్రంలో ప్రజల మధ్యకి వస్తే పూర్హిగా బయటపడే ఛాన్స్ ఉంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.