Categories: Health

Dragon Fruit : ఈ పండు తింటే బరువు తగ్గుతారా ?

కాక్టస్ జాతికి చెందిన పండు డ్రాగన్ ఫ్రూట్. మానవ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పోషకాలు ఈ పండులో పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్ లో షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంతో పాటు అరుగుదలకు చక్కగా సహకరిస్తుంది. ప్రత్యేకమైన రూపాన్ని క్రంచీ టెక్చర్‌ను కలిగి డ్రాగన్ పండు తింటే తియ్యగా ఉంటుంది. ఈ పండు ఉష్ణమండలంలో అధికంగా సాగవుతుంది. డ్రాగన్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్ రిస్కులను తగ్గిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ కివి, పియర్ ఫ్రూట్ టేస్టులను కలిగి ఉంటుంది. ఈ పండును కోయగానే మొదటగా లోపల తెల్లటి గుజ్జు నల్లటి గింజలు ఉంటాయి. ప్రతి రోజు ఒక కప్పు అంటే 227 గ్రాముల డ్రాగన్ పండును మన శరీరానికి అందిస్తే ప్రోటీన్‌లు, ఐరన్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఇ, మగ్నీసియమ్‌ , కాల్షియం లభిస్తుంది. ఎలాంటి ఫ్యాట్ ఉండని పండు ఇది. ఈ పండు గురించి ఓ ఆసక్తికరమైన విషయమూ ఉంది. యుద్ధ సమయంలో అగ్ని నుండి ఈ పండు ఉద్భవించిందని చైనీయులు నమ్ముతారు.

ప్రతి రోజు ఈ పండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది. :
డ్రాగన్ పండులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడే వ్యక్తులలో వచ్చే రిస్కులను నివారిస్తుంది. డ్రాగన్ పండును ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :
ఈ పండులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పెద్దపేగు వంటి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. డ్రాగన్‌ పండులో ఉండే విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ సి అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. ఇది మధుమేహం, అల్జీమర్స్ పార్కిన్సన్స్‌, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది :
డ్రాగన్ పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని శరీరంలో పెంచి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్‌లతో సైతం పోరాడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి మీరు చేయాల్సిందల్లా ప్రతి రోజు 200 గ్రాముల డ్రాగన్ పండును తినడం.

జీర్ణశక్తిని పెంచుతుంది :
డ్రాగన్ ఫ్రూట్‌లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్లోరా వంటి మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడుతుంది. ఇది స్మూత్ డైజెషన్‌కు తోడ్పడుతుంది. కార్బోహైడ్రేట్లే కాదు ఈ పండులో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది.ఇది జీర్ణ శక్తి మెరుగుపరచడానికి సహాయపడటంతో పాటు హార్ట్‌కు సంబంధింని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది :
ఎరుపు రంగు గుజ్జుతో ఉండే డ్రాగన్ ఫ్రూట్‌లో బీటాలైన్స్ ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ పైన ప్రభావం చూపుతుంది. గుజ్జులో ఉండే అతి చిన్నటి బ్లాక్ సీడ్స్ లో ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

వృద్ధాప్యంపై పోరాడుతుంది :
మారిన జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యంతో పాటు తినే ఆహారంలోనూ మార్పులు రావడంతో ఈ మధ్యకాలంలో వృద్ధాప్యం అతి వేగంగా వస్తోంది. సన్‌బర్న్, డ్రై స్కిన్‌, మొటిమల చికిత్సకు ఉపయోపడే యాంటీఆక్సిడెంట్లు ఈ డ్రాగన్ పండులో పుష్కలంగా లభిస్తాయి. పండులో ఉండే విటమిన సి ఛర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. డ్రాగన్ పండుగానే కాదు ప్రతి రోజు జ్యూస్ చేసుకుని తాగితే కాంతివంతమైన ఛర్మాన్ని పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం :
నల్లటి నిగనిగలాడే జుట్టు పొందాలంటే డ్రాగన్ ఫ్రూట్ పౌడర్‌ను గ్లాసు పాలల్లో కలుపుకుని ప్రతి రోజు తాగాలని న్యూట్రీషియన్స్ సూచిస్తున్నారు. ఇది ఎంతో మెరుగైన పనితీరు కనబరుతస్తుందని చెబుతున్నారు. పొడిలో ఉండే హై ప్రోటీన్స్, డ్యామేజ్ హెయిర్‌ రాకుండా నియంత్రిస్తుంది, అదే విధంగా కృత్రిమ రంగులు వాడే పనిని తగ్గిస్తుంది. మృదువైన, మెరిసేటి జుట్టును అందిస్తుంది.

కంటి ఆరోగ్యం కాపాడుతుంది :
ఈ పండులో ఉండే బీటాకెరోటిన్‌లు కంటి సమస్యలను నియంత్రిస్తాయి. ప్రతి రోజు 200 గ్రాముల డ్రాగన్ పండు తింటే కళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.

గర్భినీ స్త్రీలకు ఎంతో మేలు :
డ్రాగన్ పండులో ఉండే విటమిన్ బి, ఫోలేట్, ఐరన్‌లు గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగపడతాయి. విటమిన్ బి, ఫోలేట్‌ లు డెలివరీ సమయంలో వచ్చే సమస్యలను తగ్గించి శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం పిండం ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది. మెగ్నీషియం మహిళల్లో రెగ్యులర్ రుతుక్రమానికి సహాయపడుతుంది.

Editor Sr

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.