Double Ismart : ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అందుకే తన హిట్ సెంటిమెంట్ ను అస్సలు వదలడం లేదు పూరి. ప్రస్తుతం ఈ పవర్ ఫుల్ డైరెక్టర్ రామ్ తో డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అటు పూరీకి, ఇటు హరోకి డబుల్ కంబ్యాక్ ఇస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. డబుల్ మ్యాడ్‌నెస్‌కి రెడీగా ఉండండి అంటూ తాజాగా ఈ మూవీ టీమ్‌తో మణిశర్మ జాయిన్ అయిన విషయాన్ని సంతోషంగా పూరి అండ్ టీమ్ అనౌన్స్ చేసింది. అంతే కాదు ఈ మూవీ మరో 100 రోజుల్లో విడుదల కానుందని ఖుషి కబురును కూడా మూవీ యూనిట్ తాజాగా తెలిపింది. మళ్లీ మణిశర్మ ఎందుకు అనేదానికి ఓ లెక్క ఉంది. ఇస్మార్ట్ శంకర్ విజయంలో స్టోరీకి , రామ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కీ ఎంత ప్రాముఖ్యత ఉందో అదే విధంగా మణిశర్మ అందించిన మ్యూజిక్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. అందుకే సీక్వెల్‌లోనూ అదే స్ట్రాటజీని కంటిన్యూ చేయాలని పూరి ఫిక్స్ అయ్యాడు. అందుకే మణిశర్మ ఎంట్రీని ఉత్సాహంగా అనౌన్స్ చేశాడు.
విజయ్ దేవరకొండతో పూరి చేసిన ప్యాన్ ఇండియా మూవీ లైగర్ పెద్ద డిజాస్టర్ అని తెలుసు. ఆ ఫ్లాప్ నుంచి బయటపడాలనే పూరి మళ్లీ ఇస్మార్ట్ స్టోరీనే ఎంచుకున్నాడు. రామ్ కి కూడా చాలాకాలంగా సరైన హిట్ పడలేదు. ఈ డబుల్ ఇస్మార్ట్ తో రామ్ ప్యాన్ ఇండియా హీరోగా మారే అవకాశం ఉంది. అంతే కాదు మణిశర్మని ప్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరక్టర్‌గా నిలబెట్టి, కొంతకాలంగా తాను వెయిట్ చేస్తున్న హిట్ అందుకోవాలనే ఒకే ఒక్క టార్గెట్ తో పూరి జగన్నాథ్ గ్రౌండ్ లెవెల్ లో పని చేస్తున్నాడు. సినిమా హిట్ అవ్వడానికి అయ్యే అని ఎలిమెంట్స్ ను జోడిస్తున్నాడు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నాడు .
యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ వచ్చే ఏడాది మార్చ్ 8 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. అంటే ఈ మూవీ మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది.మార్చి 8న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ విడుదల కానున్నట్లు ఈ కొత్త పోస్టర్ ద్వారా తెలిపారు. ఇక రామ్ తనదైన స్టైలిష్ లుక్స్ తో గాగుల్స్ పెట్టుకొని గన్స్ మధ్య డబుల్ ఇస్మార్ట్ లుక్‌లో ఇరగదీశాడు. దీనితో ఇది నెట్టింట ట్రెండ్ అవుతోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.