Vastu Tips: అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతారు. ఇలా మనం భోజనాన్ని దైవ సమానంగా భావించి తినటం వల్ల మనకు తిండికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. అలా కాకుండా మనం భోజనం చేసి ఇష్టానుసారంగా భోజనాన్ని అవమానిస్తే మనకు తినడానికి కనీసం నాలుగు మెతుకులు కూడా దొరకవని చెబుతుంటారు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెబుతూ ఉంటారు. అయితే ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నం తినే సమయంలో ఎన్నో పద్ధతులను పాటించాల్సి ఉంటుందని పండితులు చెబుతుంటారు.
ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకే తిరిగి కూర్చోవాలి అలాగే భోజనం ఎప్పుడూ కూడా నేలపైనే కూర్చొని చేయాలి అప్పుడే అన్నపూర్ణాదేవి సంతోషించి ఆమె అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక భోజనం చేసేటప్పుడు ఎవరి ఇంటికి అతిథులు వచ్చిన మధ్యలో భోజనం వదిలిపెట్టకూడదు ఇలా చేయడం వల్ల సాక్షాత్తు అన్నపూర్ణ దేవిని అవమానించినట్లే అర్థం. ఇక మనం తింటున్నప్పుడు ఎంగిలి చేతితో వడ్డించుకోవడం పెద్ద తప్పు.
ఇకపోతే చాలామంది భోజనం చేసిన తర్వాత అదే ప్లేటులోనే చేతులు కడిగి పైకి లేస్తారు. ఇలా భోజనం చేసినటువంటి ప్లేట్లోనే చేతులు కడగడం పరమ దరిద్రమని పండితులు చెబుతున్నారు. మనం తినే భోజనం అన్నపూర్ణ దేవితో సమానం కనుక అదే ప్లేట్లో చేయి కడగటం వల్ల అన్నపూర్ణ దేవిని అవమానించినట్లేనని పండితులు చెబుతున్నారు. అందుకే భోజనం చేసిన తర్వాత పొరపాటున కూడా చేతులు ప్లేట్లోనే కడగకూడదు పక్కకు వెళ్లి చేతులు కడగటం ఎంతో మంచిది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.