Bathukamma: తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో బ్రతుకమ్మ పండుగ ఒకటి. ఈ పండుగను తెలంగాణ మొత్తం ఎంతో ఘనంగా తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. మహాలయ అమావాస్య నుంచి మొదలుకొని నవమి వేడుకల వరకు ఎంతో ఘనంగా తొమ్మిది రోజులపాటు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతిరోజు బ్రతుకమ్మను వివిధ రూపాలలో అలంకరించి ఊరువాడ ఎంతో ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటారనే విషయం మనకు తెలిసిందే. వివిధ రకాల పుష్పాలతో బ్రతకమ్మను అలంకరించి ఆడపిల్లలు మొత్తం బ్రతకమ్మ చుట్టూ ఆటపాటలతో డ్యాన్సులు చేస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.
ఇక సద్దుల బతుకమ్మ రోజున పెద్ద ఎత్తున బతుకమ్మను అలంకరించి ఈ వేడుకను జరుపుకుంటారు. అయితే ఈరోజు ఇందులో పసుపుతో తయారుచేసిన గౌరమ్మను ఉంచి చుట్టూ వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మను తయారు చేస్తారు. అనంతరం బతుకమ్మను నీటిలో వదిలేటప్పుడు గౌరమ్మను తీసుకొని పూల బ్రతకమ్మను మాత్రమే నీటిలో వదులుతారు. ఇలా గౌరమ్మను ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ప్రతి రూపంగా భావిస్తారు. కనుక నీటిలో నిమజ్జనం చేసే సమయంలో గౌరమ్మను తీసుకొని ఆడబిడ్డలు కుంకుమకు అద్దుకోని అమ్మవారి ప్రసాదంగా అలంకరించుకుంటారు.
అందుకే గౌరీ దేవికి ప్రతిరూపంగా చిన్న బతుకమ్మను పేర్చే సంప్రదాయం వచ్చిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇలా తొమ్మిది రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో విధంగా బ్రతుకమ్మను పేర్చి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. బ్రతుకమ్మ పండుగ వచ్చింది అంటే చాలు తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలు అందరూ కూడా పుట్టింటికి చేరుకొని ఈ పండుగను ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో బతుకమ్మ వేడుకను ఘనంగా జరుపుకోగా, ఆంధ్రాలో దేవి నవరాత్రులను అంతే వేడుకగా జరుపుకుంటారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.