Spirtual: మన భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు కంటికి కనిపిస్తూ ఉంటాయి. వేలాది ఆలయాలు, వాటి చరిత్ర చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ ఆలయాలు, దేవుడి గొప్పతనం గురించి భక్తులకి నమ్మకాన్ని పెంచేలా చేస్తాయి. ఇలాంటి ఆలయాలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయాలకి అద్బుతమైన సాక్ష్యాలు కూడా ఉంటాయి.
ఎంతో మంది భక్తులు అక్కడి కథలని అమ్మవారి శక్తిని విశ్వసిస్తారు. అలాంటి ఆలయాలలో తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలోకి చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం కూడా ఒకటి. ఈ చెంగాలమ్మ అమ్మవారు ఎంతో శక్తివంతమైనది అని అక్కడి ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. శ్రీహరికోటలో రాకెట్ లాంచ్ చేసే ముందు ఈ అమ్మ వారి ఆలయంలో శాస్త్రవేత్తలు సైతం పూజలు చేస్తారు. పదో శతాబ్ద కాలంలో ఈ శుభాగిరి అనే గ్రామంలో గొల్లవారు ఎక్కువగా నివసిస్తూ ఉండేవారు. వీరు పశువులు కాసుకుంటూ సమీపంలో కళంగి నదిలో దిగి ఈత కొడుతూ ఉండగా అందులో ఉన్నపళంగా సుడిగుండం వచ్చింది.
ఇక అందులో చిక్కుకున్న గొల్లవాడు ఓ శిలని పట్టుకొని ప్రాణాలు దక్కించుకుం టాడు. తరువాత ఆ శిలని ఒడ్డుకు చేర్చారు. అది అష్టభుజాలతో ఉన్న మహిసాసుర మర్ధిని విగ్రహం. రావి చెట్టుకి ఆనించిన ఆ విగ్రహం దానంతట అదే లేచి దక్షిణ ముఖంగా తిరిగింది. ఇక అక్కడి నుంచి దానిని కదిలించే ప్రయత్నం చేసిన ఎవరికీ సాధ్యం కాలేదు. తరువాత అమ్మవారు ఓ వ్యక్తి కలలో కనిపించి తనకి అక్కడే ఆలయం నిర్మించాలని చెప్పింది. దీంతో ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ట చేశారు.
అప్పటి నుంచి ఏడేళ్ళకి ఒకసారి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఆలయం ప్రత్యేకత ఇంకోటి ఉంది. ఓ సారి దొంగ ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి ఆభరణాలు కాజేయాలని ప్రయత్నం చేయగా అది అతనికి సాధ్యం కాలేదు. తరువాత గ్రామస్తులు తలుపులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే అమ్మవారు కలలో కనిపించి వద్దని వారించింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి తలుపులు నిర్మించలేదు. నిత్యం అమ్మవారు భక్తులకి దర్శనం ఇస్తుంది. తలుపులు తెరిచే ఉన్న ఎవరూ ఆలయంలో దొంగతనం చేసే సాహసం చేయలేరు. ఇలాంటి మహిమాన్వితమైన ఆలయాలు ఇండియాలో ఎన్నో ఉన్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.