Cool water: వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ఆహార పదార్థాలను తినడం కంటే కూడా చల్లని నీటిని తాగడానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ విధంగా చల్లని నీటి కోసం చాలామంది ఫ్రిడ్జ్ లను ఉపయోగించడం లేదంటే మట్టి కుండలను పెట్టుకొని తాగుతూ ఉంటారు. ఇక వేసవి కాలంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉందని చాలామంది ఫ్రిజ్లో నీళ్లు అధికంగా తాగుతూ ఉంటారు అయితే ఇలా చల్లని నీరు అధికంగా తాగడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చల్లటి నీరు మన జీర్ణవ్యవస్థను చాలా ఫాస్ట్ గా ప్రభావితం చేస్తుంది. రెగ్యులర్ గా కూల్ వాటర్ ను తాగితే ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. అలాగే కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, అపానవాయువు వంటి సమస్యలు రావడానికి దోహదం చేస్తుంది. చల్లని నీటిని అధికంగా తాగటం వల్ల కూడా బ్రెయిన్ ఫ్రీజ్ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చల్లని నీటిని త్రాగడమే కాకుండా ఐస్ వాటర్ లేదా ఎక్కువ ఐస్ క్రీం తినడం వల్ల కూడా ఇది వస్తుంది. నిజానికి చల్ల నీరు వెన్నెముక సున్నితమైన నరాలను ప్రభావితం చేయడంతో తద్వారా తలనొప్పి సైనస్ సమస్యలు రావడానికి కారణమవుతుంది. ఇక చల్లని నీటిని అధికంగా తీసుకోవడంతో గొంతు ఇన్ఫెక్షన్లకు గురికావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇలా కొంత ఇన్ఫెక్షన్ సమస్య కారణంగా మనం ఏదైనా ఆహార పదార్థాలను తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది అందుకే ఎంత వేడి ఉన్నప్పటికీ అధికంగా చల్లని నీటిని తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.