Krishanastami: నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ప్రత్యేకంగా కృష్ణుడిని అలంకరించి స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి స్వామి వారిని పూజిస్తార. అయితే కృష్ణాష్టమి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు మరి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఎలాంటి పనులు చేయకూడదు ఏంటి అనే విషయానికి వస్తే…
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పొరపాటున కూడా తులసి ఆకులను కోయరాదు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ తులసి ఆకులను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కోయడం వల్ల విష్ణు దేవుడి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది అందుకే పొరపాటున కూడా ఈరోజు తులసి ఆకులు కోయరాదు. కృష్ణుడు అందరిని ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా ప్రేమిస్తాడు. అతని ప్రియమిత్రుడైన సుధాముడు, పేదవాడు అయినప్పటికీ కృష్ణుడికి అత్యంత ప్రియమైనవాడు.
ఇలా పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా అందరిని కృష్ణుడు ప్రేమిస్తాడు కనుక కృష్ణాష్టమి రోజు పొరపాటున కూడా పేదవారిని కానీ ఇతరులను కానీ ఆ గౌరవంగా మాట్లాడకూడదు అదేవిధంగా పేదవారికి వీలైనంతవరకు సహాయం చేయడం ఎంతో మంచిది. ఇక కృష్ణాష్టమి రోజు చెట్లను నరకకూడదు అదేవిధంగా మాంసాహార పదార్థాలను తినకూడదు .కృష్ణాష్టమి రోజు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించే సమయంలో పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను సమర్పించకూడదు. దంపతులు శ్రీకృష్ణాష్టమి రోజునబ్రహ్మచార్యం పాటించాలి. జన్మాష్టమి రోజున శారీరక సంబంధాల నుండి దూరంగా ఉండాలి. జన్మాష్టమి రోజున పవిత్రమైన తనుమనస్సులతో కృష్ణుడిని పూజించాలి.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.