Divya Bharati : ఆమె మరణానికి అదే కారణం

Divya Bharati : 17ఏళ్ల వయసులోనే సౌత్ ఇండియాను ఓ ఊపు ఉపేసింది దివ్యభారతి. తన అందం, నటనతో అతి కొద్ది కాలంలోనే అగ్ర కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది . చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల హృదాయలను గెలుచుకుంది. బాలీవుడ్ లోనూ ఈ భామ జోరు బాగానే కొనసాగింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, గోవిందా, సునీల్ శెట్టీలతో స్క్రీన్ షేర్ చేసుకుని తన సత్తా ఏంటో చిన్న వయసులోనే చూపించింది. అప్పట్లో దివ్య భారతికి ఉన్న క్రేజే వేరు కేవలం రెండే రెండేళ్లలో ఎన్నో సినిమాలను చేసేసింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దివ్య భారతి బాలీవుడ్ నిర్మాత సాజిత్ నడియవాలాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సినిమాలను పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేసింది. అయితే ఆమె 19 ఏళ్ల వయసులోనే ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.

divya-bharati-her-death-was-accidental-says-bollywood-actor-kamal-sadanah

1993లో దివ్యభారతి ముంబైలో తను ఉంటున్న ఐదవ అంతస్తులోని అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందపడి చనిపోయింది. అప్పట్లో దివ్యభారతి డెత్ పెద్ద మిస్టరీ. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు ఉండేవి. ఎవరో కావాలని దివ్య భారతిని అపార్ట్ మెంట్ పై నుంచి పడేశారని కొందరు వాదించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆమె మరణం ఓ వీడని మిస్టరీనే. అయితే తాజాగా దివ్యభారతి మృతి పై బాలీవుడ్ నటుడు కమల్ సదానాహ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆమె మరణం కేవలం యాక్సిడెంటల్ మాత్రమే అని అన్నారు. ఈ కామెంట్స్ తో మరోసారి దివ్యభారతి మృతిపై బీ టౌన్ లో పెద్ద చర్చ జరుగుతోంది.

divya-bharati-her-death-was-accidental-says-bollywood-actor-kamal-sadanah

ఈ మధ్యనే జరిగిన ఓ ఇంటర్వ్యూలో దివ్యభారతి మృతి గురించి స్పందించారు కమల్ సదానాహ్ .. “దివ్యభారతి మరణవార్త తెలిసి షాక్ అయ్యాను. ఆమె మరణం చాలా బాధను కలిగించింది. ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో దివ్యభారతి ఒకరు. ఆమెతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉండేది. కానీ ఆమె మృతి చెందిన విషయం తెలిసి షాక్ అయ్యాను. ఆమె చనిపోయిందన్న నమ్మకం కలగలేదు. మరణానికి మూడు రోజుల ముందే దివ్యభారతితో కలిసి వర్క్ చేశాను. అప్పటికే ఆమె చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నీ కూడా పెద్ద స్టార్స్ వే. ఈ దెబ్బతో దివ్యభారతి కూడా టాప్ ప్లేస్ లో ఉంటుందని అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఆమె మేడపై నుంచి పడిపోవడం కేవలం యాక్సిడెంటల్ మాత్రమే. ఆమె డ్రింక్స్ తాగడం వల్లే అలా జరిగిందని అనుకుంటున్నా. ఆమె చాలా హెల్దీ పర్సన్. ఆమె జీవితంలోనూ ఎలాంటి సమస్యలు లేవు”అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 

 

Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

2 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.