Disha Patani : ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇండియా కోచర్ వీక్‌లో ఏడవ రోజున ఏస్ కోటూరియర్ డాలీ జె కోసం దిశా పటానీ ర్యాంప్ వాక్ చేసింది. దేశవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియుల హృదయాలను దోచుకుంది. ఏస్ ఫ్యాషన్ డిజైనర్ డాలీ జె తన విస్మయపరిచే ‘సెలీన్’ సేకరణతో అందరినీ అట్రాక్ట్ చేశారు. ఈ అద్భుతమైన కలెక్షన్స్ కు దిశా పటాని షోస్టాపర్ గా వ్యవహరించింది.
దిశా పటానీ ఈ షోలో ఆమె నమ్మశక్యం కాని ఫిట్ , ఫిజిక్‌తో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. నిజానికి ఈ బ్యూటీ ధరించే ఏ అవుట్ ఫట్ అయినా సరే ఇంటర్నెట్ ను షేక్ చేయాల్సిందే. ఈ ఈవెంట్ లో షో స్టాపర్ గా సున్నితమైన సిల్వర్ బ్రాలెట్ మెర్మైడ్ స్లిట్ స్కర్ట్ ధరించి, ఆమె ర్యాంప్ పైన రఫ్పాడించింది.
ఈవెంట్ లో దిశా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అమె మిరిమిట్లు గొలిపే లుక్ చిత్రాలు , వీడియోలను FDCI తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలు, ఫోటోలు అప్‌లోడ్ చేసిన వెంటనే, అవి త్వరగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె పోస్ట్‌లు ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించాయి . నెటిజన్స్ ఆమెను ప్రశంసలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఆమెను ఆరాధించే అభిమానులు ఆమె అందాలకు నీరాజనాలు పలుకుతున్నారు. లైక్‌లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన ఆకర్షణీయమైన అందంతో దిశా చేసిన ర్యాంప్ వాక్ ఆమె అభిమానులను విస్మయానికి గురి చేస్తింది. ఈ బ్యూటీని నిజమైన ఫ్యాషన్ క్వీన్‌గా అభివర్ణిస్తున్నారు.
తన షోస్టాపర్ లుక్ కోసం, దిశా సిల్వర్ అవుట్ ఫిట్ ధరించింది, డీప్ నెక్‌లైన్, సన్నని స్ట్రిప్స్ , సీక్విన్స్ డిజైన్స్ తో ఉన్న బ్రాలెట్ టాప్ వేసుకుంది. దానికి జోడీగా తొడ-ఎత్తైన సైడ్ స్లిట్‌ను కలిగి ఉన్న మ్యాచింగ్ మెర్‌మైడ్ స్కర్ట్ ను ధరించిందిజ . ఈ అవుట్ ఫిట్ భామ శరీరాన్ని సంపూర్ణంగా కౌగిలించుకుని, ఆమె తొడ అందాలను చూపించాయి. మెరిసే డిటైలింగ్ , సైడ్ స్లిట్ లో వచ్చిన అవుట్ ఫిట్ ఆమె అందాలను రెట్టింపు చేశాయి.
యాక్సెసరీల విషయానికొస్తే, నటి సిల్వర్ స్టేట్‌మెంట్ చెవిపోగులు, మణికట్టుపై మ్యాచింగ్ బ్రాస్‌లెట్ , ఒక జత వెండి మెరిసే స్ట్రాపీ హీల్స్‌ను ఎంచుకుంది. మేకప్ కోసం దిశా మెరిసే ఐషాడో, రెక్కల ఐలైనర్, మాస్కరేడ్ లాషెస్, కాంటౌర్డ్ చీక్స్ నిగనిగలాడే పీచ్ లిప్‌స్టిక్‌ను ఎంచుకుని తన గ్లామ్ రూపాన్ని ముగించింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.