Director Shankar: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో పక్కా కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నారు. బాపు – రమణ, కె విశ్వనాథ్ వంటి క్లాస్ చిత్రాలను తీసిన అగ్ర దర్శకులూ ఉన్నారు. అందరిలోనూ క్రియేటివ్ జీనియస్ శంకర్ శైలి వేరే. ఆయన సినిమా కథాంశాలు అన్నీ కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటాయి. అంతే కాదు ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకునేలా కథ, కథనాలు రచిస్తుంటారు. ఉదాహరణకు రోబో సిరీస్. ప్రపంచ వ్యాప్తంగా రొబొటిక్ టెక్నాలజీ రాబోతుందనే విషయాన్ని దాని ప్రాచుర్యం, ప్రపంచం మొత్తం ఎంతగా ఈ టెక్నాలజీపై ఆధారపడుతుందీ అనే అన్‌బిలీవబుల్ విషయాలను సినిమా ద్వారా చెప్పారు.
ఇప్పటికే కొన్ని దేశాలలో రొబొటిక్ టెక్నాలజీను వాడుతున్నారు. సోషల్ వెబ్ సైట్స్ ను ప్రస్తుతం రివ్యూ చేయడంలో రొబోస్ పాత్ర కీలకంగా మారింది. అంతేకాదు, పై స్థాయి చదువులలో టెక్నాలజీ పరంగా అంటే ఎక్కువ మంది రొబొటిక్ టెక్నాలజీనే ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు అన్నీ పనులు మనుషులే చేశారు. కానీ, ఇకపై సగం శాతం రోబోస్ చేస్తాయి. యుద్ధాలలోనూ, ఆసుపత్రులలోనూ, కన్‌స్ట్రక్షన్ అలాగే మరెన్నో భారీ స్థాయిలో చేసే పనులన్నీ ఈ రోబొటిక్ టెక్నాలజీనే చేయనుంది. అయితే, మన భారత దేశంలో ఎక్కువ మంది విద్యార్థులు ఈ టెక్నాలజీని ఎంచుకోవడానికి కారణం శంకర్ రూపొందించిన రోబో సినిమానే అని చెప్పక తప్పదు.
ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే, దీనికి కొనసాగింపుగా వచ్చిన రోబో 2.ఓ మాత్రం ఆశించిన సక్సెస్ సాధించలేదు. కానీ, ఈ మూవీలో శంకర్ చూపించిన టెక్నికల్ విషయాలు మాత్రం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్ వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్నీ నష్టాలూ ఉన్నాయని రోబో 2.ఓ సినిమాలో చూపించడం ఆసక్తికమైన విషయం. ఐ సినిమాలోనూ జనటిక్ డిజార్డర్ గురించి వివరించాడు. ఒక మనిషి రక్తంలోకి వైరస్ పంపితే దానివల్ల ఆ మనిషి ఆకారంలో ఎలాంటి మార్పు వస్తుంది..సమాజం ఆ మనిషిని ఎలా చూస్తుంది..అనే ఎమోషనల్ అంశాలను జోడించి తెరకెక్కించారు.
ఇక గతంలో ఒకే ఒక్కడు, భారతీయుడు లాంటి సోషల్ మెసేజ్‌తో కూడుకున్న కమర్షియల్ సినిమాలు తీసి భారీ సక్సెస్ అందుకున్నారు. ఒకే ఒక్కడు సినిమాలో ఒక్క రోజు సీఎం అయితే ..ఆ అవకాశం ఒక సామాన్యుడికి వస్తే ఎలాంటి ఫలితాలుంటాయి.. ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఇక భారతీయుడు సినిమాలో లంచం తీసుకున్నవాడు కన్న కొడుకైనా నేరం చేసినట్టే..అలాంటి వాడిని చంపడానికి కూడా వెనకాడకూడదు అనే హెవీ ఎమోషనల్ కంటెంట్‌తో భారతీయుడు సినిమాను తెరకెక్కించారు. ఇలా ఆయన తీసే సినిమా సమాజం మీద ప్రభావం చూపేలా సమాజంలో జరుగుతున్న పొరపాట్లను వివరిస్తూ తీస్తున్న సినిమాలు అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.