Categories: EntertainmentLatest

Dhanush : ధనుష్‌కు పెద్ద షాక్ ఇచ్చిన ఐశ్వర్య

Dhanush : గత కొంత కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ గురించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. రెండేళ్ల క్రితమే తాము విడిపోతున్నామంటూ ప్రకటించి ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. రీసెంట్ గానే ధనుష్, ఐశ్వర్య చెన్నై ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ కోసం అఫీషియల్ గా అప్లై చేశారు. అయితే ఇన్నాళ్లు వీరిద్దరూ ఎలాగైనా కలుస్తారని ఎదురుచూసిన ఫ్యాన్స్ బాగా అప్సెట్ అయ్యారు.దాదాపు 18 ఏళ్లు హ్యాపీగా ఉన్న ఈ స్టార్ జంట విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ముందు ధనుష్ , ఐశ్వర్య డివోర్స్ తీసుకుంటున్నారంటే ఎవరూ నమ్మలేదు. రూమర్ లా కొట్టి పారేశారు. అందులోనూ ఇటు ధనుష్, అటు ఐశ్వర్య వారి వారి వర్క్స్ లో బిజీగా మారిపోయారు. ధనుష్ యూనిక్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తుంటే.. ఐశ్వర్య డైరెక్టర్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే రజనీకాంత్ తో కలిసి ఐశ్వర్య లాల్ సలామ్ అనే మూవీ చేసింది. ఇక వీరిద్దరూ విడిపోవడం కన్ఫామ్ కావడంతో ఇప్పుడు పిల్లల బాధ్యత ఎవరిది అన్న టాపిక్ ఆసక్తికరంగా మారింది . పిల్లలు ఎవరి దగ్గర ఉంటారనేది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

dhanush-i-want-my-children-says-aishwarya-rajinikanth

పిల్లలు ఐశ్వర్య దగ్గరే ఉంటారని తాజా సమాచారం. అంతే కాదు పిల్లలు తన దగ్గరే ఉండాలని, వారిని పోషించే బాధ్యత తనకు అప్పగించాలని ఆమె డిమాండ్ కూడా చేశారు. ఈ విషయంలో ఐశ్వర్య. ఫుల్ క్లారిటీతో ఉన్నారట. మరి ధనుష్ ఎలాంటి రిప్లై ఇస్తాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

dhanush-i-want-my-children-says-aishwarya-rajinikanth

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ . తండ్రి సినిమా ఫీల్డ్ కావడంతో తన కెరీర్ ను కూడా అక్కడే మొదలుపెట్టింది. కొన్నేళ్లుగా ఫిల్మ్ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉంటోంది ఐశ్వర్య. ‘3’మూవీతో ఐశ్వర్య డైరెక్టర్ గా మారింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా, స్టార్ హీరోయిన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక పర్సనల్ విషయానికి వస్తే ధనుష్, ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది 18 ఏళ్ల బంధం. వీరికి యాత్ర, లింగ అనే పిల్లలు ఉన్నారు. మొదటి కొడుకు యాత్రకు 18 ఏళ్లు. చిన్నకొడుకు లింగాకి 14 ఏళ్లు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట ఇప్పుడు విడిపోయింది. త్వరలో డివోర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ధనుష్, ఐశ్వర్య విడిపోవడానికి కారణం ఏమిటి అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

Sri Aruna Sri

Recent Posts

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

6 minutes ago

Breast Cancer: మహిళల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్లు.. తెలుసుకోవలసిన విషయాలు ఇవే!

Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…

2 hours ago

Politics: తెలంగాణపై మోదీ కన్ను.. రూటు మార్చిన రేవంత్‌..!

Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…

3 hours ago

Politics: ఇక నంబర్ 1 ఆయనే.. మోదీ అరుదైన రికార్డ్‌..!

Politics: భారత రాజకీయ చ‌రిత్ర‌లో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…

4 hours ago

Parama Ekadashi : నేడే పరమ ఏకాదశి.. మూడేళ్లకు ఒకసారి వచ్చే విశిష్టమైన రోజు..ఇలా పూజ చేస్తే చాలు ..

Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…

5 hours ago

Beauty Tips: ఎండకు చర్మం నల్లబడిందా… అరటి పండు మాస్క్ తో ట్యాన్ కు చెక్ పెట్టండి?

Beauty Tips: వేసవికాలంలో బయటకు వెళ్తే ఒక్క సారిగా చర్మం మొత్తం నల్లబడిపోతుంది. ఇలా చర్మం మొత్తం ట్యాన్ కావడంతో…

22 hours ago

This website uses cookies.