Devotional Tips: హిందువులు ఏకాదశిని ఎంతో పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఏకాదశి రోజున లక్ష్మి నారాయణలను పూజించడం వల్ల వారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి నెలలోనూ రెండు ఏకాదశలు వస్తాయి ఒకటి కృష్ణపక్షంలో రాగా మరొకటి శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది. ఈ క్రమంలోనే మే 31వ తేదీ కూడా ఏకాదశి రావడం విశేషం. ఇక జేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సకల పాపాలు దూరమవుతాయని చెప్పాలి.
ఇక ఈ మధ్యలో ఏకాదశి రోజు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి మొక్క విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. హిందువులు తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తూ పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు. ఇలా లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి తులసి మొక్కను నిర్జల ఏకాదశి రోజు పొరపాటున కూడా గోర్లతో గిల్లడం,మురికి చేతులతో తాకడం ఎంతో పాపం అలాగే నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్కకు కనీసం నీరు కూడా పోయకూడదు.
ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసిమాలతో పూజించడం ఎంతో శుభకరం అయితే ఈ తులసి ఆకులను ముందు రోజు తుంచి పెట్టుకోవాలి. ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. ఇక తులసి కోట ప్రాంగణంలో చెప్పులు బూట్లు వదలడం పనికిరాని వస్తువులను వేయడం కూడా అసలు మంచిది కాదు.అందుకే ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా తులసి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పూజించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మన పైనే ఉంటాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.