Devotional Tips: సాధారణంగా హిందువులు వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పెద్ద ఎత్తున పూజలు చేయడం గుడికి వెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే చాలామంది గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ దీపం వెలిగించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు అయితే గుడికి వెళ్లిన తర్వాత ముందుగా దీపం ఎక్కడ వెలిగించి పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియక గుడి ప్రాంగణంలో వారికి అనువైన చోట దీపం వెలిగిస్తుంటారు. అయితే గుడికి వెళ్ళిన చోట ముందుగా దీపం ఎక్కడ వెలిగించాలి ఏంటి అనే విషయానికి వస్తే…
ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత దేవాలయానికి వెళ్లి అక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే దేవాలయానికి వెళ్ళిన తర్వాత అందరూ గర్భగుడిలోకి వెళ్లి దేవుడి ముందు దీపం పెట్టి పూజిస్తారు. అయితే ఆలయానికి వెళ్ళిన తర్వాత మొదటగా గర్భగుడిలో దీపం పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. మన గుడికి వెళ్ళిన తర్వాత నేరుగా గర్భగుడికి వెళ్లి స్వామి వారిని పూజించకూడదు ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గరకు వెళ్లి అక్కడ నమస్కరించి దీపం వెలిగించాలి.
ఈ విధంగా ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించిన తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ క్రమంలో ఆలయంలో ఉన్న ఇతర దేవతలకు కూడా నమస్కరించి పూజ చేసిన తర్వాత గర్భగుడిలోకి వెళ్లాలి. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా మూడు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. ఆ తర్వాత ఐదు తొమ్మిది ఇలా వారికి తోచినన్ని ప్రదక్షిణలు చేయవచ్చు.
ఇక ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత గర్భగుడిలోకి వెళ్లి అక్కడ దేవుడు ముందు దీపం వెలిగించి మనం తీసుకువెళ్లిన పండ్లు పూలు నైవేద్యం దేవుడికి సమర్పించాలి. ఇలా దేవుడిని నమస్కరించుకొని తిరిగి నేరుగా ఇంటికి వెళ్ళాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.