Devara: జాన్వీ అందాలు మిస్సయ్యాయనే.. దసరా నుంచి దావూదీ పాటను ‘దేవర’ చిత్రంలో చిత్ర బృందం యాడ్ చేయబోతున్నారని తాజా సమాచారం. ముఖ్యంగా ఈ పాటలో జాన్వీ కపూర్ అందాలు మిస్సయ్యాయని సినిమా రిలీజ్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఫీలయ్యారు. ప్రమోషన్స్ లో భాగంగా ముందు విడుదల చేసిన దావూదీ లిరికల్ వీడియో సాంగ్ అందరినీ తెగ ఆకట్టుకుంది. థియేటర్స్‌లో విజిల్స్ వేసి స్టెప్పులేద్దామనుకున్న ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది.
అయితే, అప్పటికే సినిమా రన్ టైమ్ ఎక్కువైందని చిత్రంలో ఈ పాటను, అలాగే జాన్వీ కపూర్ కి సంబంధించిన సన్నివేశాలను ఎడిటింగ్ లో లేపేశారు. దాంతో గ్రాండ్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉండటం వల్ల ఎవరినీ ఆనందపరచలేకపోయింది. మొదటి రోజు ఫ్లాప్ టాక్ వినిపిచినప్పటికీ ‘దేవర’ వసూళ్ళ పరంగా 172 కోట్లను రాబట్టి సునామీ అంటే ఇలా ఉంటుందని నిరూపించింది.
కాగా, ఈ దసరా పండుగ రోజు నుంచి అదనంగా ‘దేవర’ చిత్రంలో జాన్వీ నటించిన సన్నివేశాలను, అలాగే దావూదీ పాటను యాడ్ చేస్తున్నారట. ఖచ్చితంగా ఇదే జరిగితే ఇంకా కలెక్షన్స్ పెరగడం ఖాయం. ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించి హిట్ కొట్టిన హీరోలకి ఆ తర్వాత సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు ఈ సినిమాతో తారక్ అది బ్రేక్ చేశాడు. అంతేకాదు, ‘ఆచార్య’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల పరిస్థితి ఏంటో అనుకున్న వాళ్ళకి కాస్త షాక్ తగిలింది. ఈ సక్సెస్‌తో ‘దేవర పార్ట్ 2’ పై అంచనాలు ఊహకందడం లేదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.