Deepika Padukone : గ్లామర్.. యాక్టింగ్.. యాక్షన్..రొమాన్స్ ఇలా ఏ జానర్ తన పాత్రను అవలీలగా పోషించే సత్తా ఉన్న బాలీవుడ్ నటి దీపికా పదుకొణె. పెళ్లికి ముందే కాదు పెళ్లైన తర్వాత కూడా ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పఠాన్ హిట్ తరువాత చేతినిండా సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది దీపికా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘కల్కి 2898 ఏడీ’ తో పాటు ‘ఫైటర్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోస్తూ అదరగొడుతోంది. మొన్నామధ్య కాఫీ విత్ కరణ్ షోలో తాను మాట్లాడిన మాటలను నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు. అయినా ఎక్కడా తగ్గేదేలే అంటూ తన దారిలో తను వెళిపోతుంది. ఓ వైపు ఫ్యామిలీని , మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చూస్తూ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా సినిమాల గురించే కాదు పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది.
” ఓ మోడల్ గా నా కెరీర్ ప్రారంభమైంది. మోడలింగ్ ఫీల్డ్ లో నాకు మంచి గుర్తింపు వచ్చింది. నా ఫ్యాషన్ గురువులంతా నువ్వు ఇక్కడ ఉంటే గ్రోత్ ఉండదని చెప్పారు. ప్యారిస్, న్యూయార్క్, మిలన్ వెళ్లిపో అని సలహా ఇచ్చారు. నా దేశం భారత్. నేనెందుకు ఇక్కడి నుంచి వెళ్లాలి? అని అనుకునేదాన్ని. ఇండియాలోనే ఉంటూ ఓ మోడల్ గా అన్ని అవకాశాలను అందుకున్నాను. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు వర్క్ చేశాను. ఫేమస్ బ్రాండ్ లూయీస్ విట్టన్ తో పని చేస్తున్నప్పుడు.. వాళ్ల ప్రాడక్ట్స్ పక్కన నా ఫొటోలు పెట్టి సోషల్ మడియాలో వినియోగించుకునేవారు. వాళ్లు నన్ను ఓక ఇన్ఫ్లుయెన్సర్లా వాడుకోవడం చాలా చిన్నతనంగా అనిపించింది.
ఆ తర్వాత నేను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో సభ్యురాలిగా ఫ్రాన్స్ లో అడుగు పెట్టాను. అప్పుడు అక్కడ నా నిలువెత్తు హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. అప్పుడే తొందరపాటు ఏమాత్రం మంచిది కాదనిపించింది. ముంబయికి వచ్చిన కొత్తలో నేను చాలా చిన్నదానిని. ఎన్నో కష్టాలు పడ్డాను. నా తిండి నేనే సంపాదించుకోవాల్సిన పరిస్థితి. ఒక్కదానినే అన్నీ ఎదుర్కొన్నాను. నా వెంటే నా లగేజీ ఎప్పుడూ ఉండేది. మిడ్ నైట్ వరకు షూటింగ్స్ చేసి అదే లగేజీతో క్యాబ్లుల్లోనే పడుకునేదానిని. కానీ ఇవ్వన్నీ నాకు భారంగా, కష్టంలా అనిపించలేదు. ఎందుకంటే ఇవి మన పనులు. మనకు మనం చేసుకోవాల్సిందే.
20 ఏళ్ల ముందు సినిమాలే ప్రపంచం అనుకున్నా. ఇది తప్ప నాకు మరో మార్గం లేదనుకున్నా. కానీ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకోవడం పెద్ద టాస్క్. ఎందుకంటే నా పేరెంట్స్ ఇండస్ట్రీకి చెందినవారు కాదు. నాకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. అప్పట్లో సహజంగానే సినీ ఫ్యామిలీస్ కు చెందిన వారసులకే సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కేది. దీన్నే నెపోటిజం అంటున్నారిప్పుడు. ఈ నెపోటిజం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం ఇది. ఏ విషయమైనా నా మనసుకి నచ్చితే నేను దానిని బలంగా నమ్ముతా. దానికి కట్టుబడి ఉంటా. నేనెవరికీ భయపడను. అప్పట్లో ఢిల్లీలో జేఎన్యా విద్యార్థుల తరపున నిలబడ్డాను. నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. అయినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు అది కరెక్ట్ అనిపించింది. కొన్ని కారణాల వల్ల 2014లో తీవ్ర డిప్రెషన్ కి వెళ్లిపోయాను. అప్పటి నుంచి మెంటల్ హెల్త్ కు ప్రయారిటీ ఇస్తున్నా. ఆ సమయంలో గ్యాప్ లేకుండా పని చేయడం నాకో మార్గంలా అనిపించింది. నన్ను నేను ఒక వర్క్ హాలిక్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను.
నా భర్త రణ్వీర్ తో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ విషయం. కానీ మా ప్రొఫెషన్స్ కారణంగా అది కుదరదు. షూటింగ్, ప్రయాణాలతో ఇద్దరం ఎప్పుడూ బిజీగానే ఉంటాము. ఒక్కోసారి రణ్వీర్ ఏ అర్ధరాత్రో ఇంటికొస్తాడు. నేను తెల్లవారుజామునే వెళ్లిపోవాల్సి వస్తుంది. అందుకే మా మధ్య లవ్ పెరగడానికి, ఫ్యామిలీతో గడపడానికి మాకంటూ ఓ షెడ్యూల్ ఎప్పుడూ పెట్టుకుంటున్నాం. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. వీకెండ్స్ లో నేను రణ్వీర్ కలిసి మ్యూజిక్ వింటాం. కలిసి డ్యాన్స్ చేస్తుంటాం. ఒక్కోసారి తెల్లారిపోతుంటుంది”అని తన పర్సనల్ , ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంది దీపికా.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.